Saturday, November 14, 2026 10:03 AM
Saturday, November 14, 2026 10:03 AM

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన ముంబై హోటల్ రాత..!

ముంబైలోని చెంబూరు ప్రాంతంలో కేవలం మూడు టేబుళ్లు, 9 సీట్లతో ప్రారంభమైన ఒక చిన్న చోలే భటూరే హోటల్ అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరుకుంది. జస్పాల్ సింగ్ ఖల్సా, మహీందర్ సింగ్ ఖల్సా అనే ఇద్దరు సోదరులు అక్టోబర్ 2021లో ప్రారంభించిన ఢిల్లీ సే అనే ఈ చిన్న అవుట్‌లెట్, వ్యాపారం సాగక 2022 సెప్టెంబర్ నాటికి దాదాపు రూ.18 లక్షల అప్పుల్లో పడిపోయింది. ఆఖరి నెల అద్దె, కిరాణా సామాను డబ్బులు కట్టేసి హోటల్‌ను శాశ్వతంగా మూసివేయాలని ఆ సోదరులు భావించారు.

Also Read : తెనాలి మాజీ ఎమ్మెల్యే గారి చీటింగ్ లీలలు..!

కానీ, వారు తీసుకున్న ఆఖరి నిర్ణయానికి ముందే ఒక అద్భుతం జరిగి వారి వ్యాపార రాతనే మార్చేసింది. మొదటగా ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ అభిషేక్ ఉపమన్యు ఈ హోటల్‌ను సందర్శించి, ఇక్కడి చోలే భటూరే రుచి నచ్చి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఆ తర్వాత, ఢిల్లీ తరహా అసలైన చోలే భటూరే రుచుల కోసం వెతుకుతున్న బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఈ హోటల్ గురించి తెలిసింది. తన భర్త, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇష్టమైన ఈ వంటకాన్ని ఆర్డర్ చేయడానికి ఆమె జుహూలోని తన నివాసం నుండి హోటల్‌కు ఫోన్ చేశారు.

Also Read : మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ బంపర్ ఆఫర్..!

మొదట ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని హోటల్ యజమాని జస్పాల్ భయపడినప్పటికీ, చివరకు అది విరాట్ కోహ్లీ ఇల్లేనని నిర్ధారించుకుని అక్టోబర్ 5, 2022న రెండు ప్లేట్ల చోలే భటూరేలను డెలివరీ చేశారు. ఆ ఆహారం తిన్న తర్వాత అనుష్క శర్మ ఎంతో సంతోషపడి, “ముంబైలో ఎట్టకేలకు అసలైన ఢిల్లీ లాంటి చోలే భటూరే దొరికాయి” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ ఒక్క పోస్ట్‌తో ఆ హోటల్ వద్ద జనసందోహం ఒక్కసారిగా పెరిగిపోయింది, ఎంతలా అంటే గుంపును అదుపు చేయడానికి పోలీసులు రావాల్సి వచ్చింది.

అప్పటివరకు రోజుకు కేవలం అర కిలో లేదా ఒక కిలో చోలే వండే ఆ హోటల్‌లో, ఇప్పుడు రోజుకు ఏకంగా 125 కిలోల చోలే వండుతున్నారు. అప్పట్లో నెలకు కేవలం రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల లోపు అమ్మకాలు సాగించే ఈ బ్రాండ్, ఇప్పుడు ముంబై వ్యాప్తంగా నాలుగు అవుట్‌లెట్లతో విస్తరించి, రోజుకు 3,000 ప్లేట్లకు పైగా విక్రయిస్తూ నెలకు దాదాపు రూ.2 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అసలు మైక్రోసాఫ్ట్ కు...

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో...

నా ఫోన్ లో...

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత...

సీఐఐ సమ్మిట్‌లో లోకేష్,...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

గిరిజనుల అభిమానం పవన్...

గిరిజనులను ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్ చేసిన...

‘ఇట్లు అర్జున’ రివ్యూ...

‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’...

కూటమిలో పంచాయతీ కుంపట్లు..!

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటి...

పోల్స్