Monday, September 28, 2026 12:01 PM
Monday, September 28, 2026 12:01 PM

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ బంపర్ ఆఫర్..!

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సరికొత్త నిబంధనలను తీసుకువస్తూ మొబైల్ ప్రియులకు తీపి కబురు అందించింది. సాధారణంగా టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ల పేరుతో కేవలం 28 రోజుల కాలపరిమితిని మాత్రమే ఇస్తుండటంతో, వినియోగదారులు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు గానూ, ఇకపై ప్రతి కంపెనీ ఖచ్చితంగా పూర్తి 30 రోజుల కాలపరిమితితో కూడిన ప్లాన్లను అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం మరియు ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి.

Also Read : నేను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు.. కోహ్లీ కీలక ప్రకటన..!

ట్రాయ్ తీసుకువచ్చిన ఈ నూతన టెలికాం వినియోగదారుల రక్షణ సవరణ నిబంధనల ప్రకారం, 28 రోజులకు బదులుగా 30 రోజుల రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల వినియోగదారులు సాధారణ నెలల మాదిరిగానే ఏడాదికి కేవలం 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాకుండా, ప్రతి నెలా ఒకే తేదీన ప్లాన్ ఆటోమేటిక్‌గా రెన్యూవల్ అయ్యేలా సరికొత్త వోచర్లను కూడా ప్రవేశపెట్టాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా మధ్యతరగతి, సాధారణ ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది.

Also Read : ‘డిజీ వెరిఫై’.. డిజిటల్ విధానంలోనే వెరిఫికేషన్..!

మరో కీలక మార్పు ఏంటీ అంటే.. ఇంటర్నెట్ లేదా డేటా అస్సలు ఉపయోగించని సాధారణ మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేక నిబంధనను చేర్చారు. కేవలం ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు మాత్రమే అవసరమయ్యే వారి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ఫ్రెండ్లీ వాయిస్-ఓన్లీ ప్లాన్లను తక్కువ ధరలకే అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది. డేటా అవసరం లేకపోయినా భారీ ప్లాన్లను కొనుగోలు చేయాల్సి వస్తున్న గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు, ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఈ కొత్త వాయిస్ ప్లాన్లు ఎంతగానో ప్రయోజనకరంగా మారనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

పోల్స్