Monday, September 28, 2026 12:13 PM
Monday, September 28, 2026 12:13 PM

‘డిజీ వెరిఫై’.. డిజిటల్ విధానంలోనే వెరిఫికేషన్..!

ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ అంశం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. డీఎస్సీ 2025లో నకిలీ సర్టిఫికేట్లు ఉన్న వారికి ఉద్యోగులు ఇచ్చారనేది కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి ఇప్పటికే విద్యా శాఖ అధికారులు, కష్టపడి ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులతో పాటు టీడీపీ నేతలు కూడా ఎన్ని సార్లు వివరణ ఇచ్చినా, వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొట్టినా కూడా.. ఇప్పటికీ ఆ పార్టీ నేతల తీరులో మార్పు రాలేదు. చివరికి విజయవాడలోని శాప్ కార్యాలయం ముందు ఆందోళన చేయటమే కాకుండా.. ఉపాధ్యాయులపై దాడి కూడా చేశారు. దీంతో సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : మీ కళ్లు వయసు కంటే వేగంగా మారిపోతున్నాయా..?

ఆంధ్రప్రదేశ్‌లో సర్టిఫికెట్ల ధ్రువీకరణ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రభుత్వ విభాగాలు ధ్రువీకరించే సర్టిఫికెట్‌లను సాధ్యమైనంత వరకు డిజిటల్ విధానంలోనే పరిశీలించాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ‘డిజీ వెరిఫై’ వేదికను వినియోగించాలని అధికారులకు సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాల కోసం సమర్పించే ధ్రువపత్రాల పరిశీలనలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. గతంలో జారీ చేసిన మాన్యువల్ సర్టిఫికెట్లను పరిశీలించడంలో జాప్యం, పొరపాట్లు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Also Read : జగన్ మునిగితే తాను మునుగుతా అనే సాయి రెడ్డి భయమా..?

డిజిటల్ ధ్రువీకరణ ద్వారా సర్టిఫికెట్లను ప్రభుత్వ వ్యవస్థలోనే నేరుగా పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో ఫిజికల్ కాపీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో పాటు ధ్రువీకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. నకిలీ లేదా అనర్హమైన ధ్రువపత్రాల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశాలను కూడా అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్‌లను సంబంధిత విభాగాలు ఇకపై ‘డిజీ వెరిఫై’ వేదిక ద్వారానే ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ వేదికలో అందుబాటులో లేని సర్టిఫికెట్లకు మాత్రమే మాన్యువల్‌గా పరిశీలన చేపట్టేందుకు అనుమతి ఉంటుంది. ఇటీవల డీఎస్సీ నియామక ప్రక్రియలో స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ సందర్భంగా ఎదురైన ఇబ్బందులు కూడా ఈ నిర్ణయానికి కారణాల్లో ఒకటిగా తెలుస్తోంది. కొత్త విధానంతో సర్టిఫికెట్ల పరిశీలనలో జాప్యం తగ్గడంతో పాటు పారదర్శకత పెరగనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్...

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో...

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

పోల్స్