Saturday, September 26, 2026 02:35 PM
Saturday, September 26, 2026 02:35 PM

జగన్ మునిగితే తాను మునుగుతా అనే సాయి రెడ్డి భయమా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సీపీఐ నేతల భేటీ తీవ్ర సంచలనంగా మారింది. ప్రజల సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తామని ఇరు పార్టీలు ప్రకటించుకున్నప్పటికీ, ఈ పరిణామంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సరికొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. సజ్జల రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ ఆయన వేసిన సటైర్లు, పరోక్షంగా జగన్‌కు ఒక బలమైన రాజకీయ హెచ్చరిక లాంటిదేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : రెండు రోజులు.. 21 హై-ప్రొఫైల్ మీటింగ్స్.. నారా లోకేష్ మెరుపు టూర్..!

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో సీపీఐ ఒక కీలక భాగస్వామి. ఈ నేపథ్యంలో సీపీఐతో వైసీపీ చేతులు కలపడమంటే, పరోక్షంగా వైఎస్ జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లేనని విజయసాయి రెడ్డి తన ట్వీట్ ద్వారా విశ్లేషించారు. ఇన్నాళ్లూ కేంద్రంలోని అధికార బీజేపీతో స్నేహపూర్వక లేదా తటస్థ సంబంధాలను కొనసాగించిన జగన్, ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్న శక్తులతో జతకడితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలు ఈ ట్వీట్ ద్వారా వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం.. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని కాదని, ప్రతిపక్ష ఇండియా కూటమికి దగ్గరైతే వైసీపీ తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందనే కోణాన్ని సాయిరెడ్డి ట్వీట్ స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వైసీపీకి, కేసుల ఉచ్చులో ఉన్న జగన్ అండ్ కొకి.. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల మద్దతు లేదా తటస్థ వైఖరి ఎంతో అవసరం. జగన్ కేసుల్లో సాయి రెడ్డి కూడా కీలకంగా ఉన్నారు. ఏ2గా ఉన్న సాయి రెడ్డికి జగన్ ఇండియా కూటమికి దగ్గరైతే కష్టాలు తప్పవు.

Also Read : బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో వైసీపీ కీలక వికెట్ డౌన్..!

సాయి రెడ్డి వైసీపీలో ఉన్న సమయంలో, బిజెపిని జగన్ కు దగ్గర చేసారు. ఇప్పుడు ఇండియా కూటమికి దగ్గరైతే సాయి రెడ్డి పడిన కష్టం మొత్తం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి పరోక్షంగానైనా దగ్గరైతే, అది కేంద్రంలోని బీజేపీకి ఆగ్రహం తెప్పించవచ్చని, తద్వారా రాబోయే రోజుల్లో వైసీపీ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందనే హెచ్చరిక ఈ వ్యాఖ్యల వెనుక దాగి ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

3,677 ఉద్యోగాలు.. మాయమైన...

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న DSC...

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పోల్స్