ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు. ఇక నుంచి అంతా అదే ఖైరతాబాద్ గురించే చర్చించుకుంటున్నారు. అదే ఉప ఎన్నిక రాజకీయం. బై పోల్ బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఇప్పటికే దాదాపు ఖరారయ్యాయి. కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ మరోసారి పోటీ చేయడం ఖాయం అంటున్నారు హస్తం పార్టీ నేతలు. బీఆర్ఎస్ నుంచి తలసాని సాయికిరణ్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. బీజేపీ వైపు నుంచి చింతల రామచంద్రారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ కేవలం రెండేళ్ల పదవీకాలం మాత్రమే మిగిలింది. ఈ తక్కువ సమయంలో ప్రజలు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : జనసేన గూటికి కీలక నేతలు.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!
గతంలో ఆరు సార్లు గెలిచిన దానం నాగేందర్ చరిత్ర కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ మారిన కారణంగా గతంలో ఆయన ఓడిపోయిన సెంటిమెంట్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. యువత ఆలోచనలు, స్థానిక సమస్యలు ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎతున చర్చ జరుగుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి నాయకులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటి నుంచే సమీకరణా లు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం పార్టీలు భారీగా ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాయి. సాధారణంగా ఉప ఎన్నిక అంటే నెల రోజుల హడావుడి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం కనీసం నాలుగు నుంచి ఐదు నెలల పాటు ప్రచారం సాగనుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఈ గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని పర్యవేక్షించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ తరహాలోనే ప్రతీ డివిజన్లో రోడ్ షోలు జరగనున్నాయి. మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇంటింటి ప్రచారం కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకుని యువతను టార్గెట్ చేస్తున్నారు. ప్రచార ఖర్చు అంచనాలు కోట్లలో ఉంటున్నాయి. సోషల్ మీడియా రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల హామీలిస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రచార పర్వం పార్టీల ఆర్థిక వనరులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న ఓటర్ల సవరణ ప్రక్రియ ఈ ఎన్నికలో అత్యంత కీలకమైన మలుపు కానుంది. నవంబర్ రెండో వారంలో తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. డ్రాఫ్ట్ జాబితాలో మూడింట ఒక వంతు ఓట్లు మాయమవడం తీవ్ర కలకలం రేపింది. ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాతే ఖైరతాబాద్ అసలు ఓటర్ల సంఖ్య స్పష్టమవుతుంది. ఆ జాబితా ఆధారంగానే పార్టీలు తమ బూత్ స్థాయి వ్యూహాలను ఖరారు చేస్తాయి. ఇప్పటికే ఖైరతాబాద్ పరిధిలో లక్షకు పైగా ఓట్లు మాయమైనట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్లు, యువత ఓట్లు ఏ పార్టీకి పడతాయనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ లెక్కలన్నీ తుది జాబితా విడుదలయ్యాక మరింత స్పష్టతకు వస్తాయి.
Also Read : డ్రామాలు వద్దు.. వైఎస్ జగన్కు టీఎంసీ ఎంపీ స్లిప్పర్ షాట్..!
ఈ ఉప ఎన్నికలో బీసీ వర్గాల ఓట్లు అత్యంత నిర్ణాయక పాత్ర పోషించనున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా బీసీ అభ్యర్థులనే బరిలో నిలపడం విశేషం. దానం నాగేందర్, తలసాని సాయికిరణ్ యాదవ్ ఇద్దరూ అదే వర్గానికి చెందిన నాయకులు. బీజేపీ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చింతల రామచం ద్రారెడ్డిని రంగంలోకి దించుతోంది. దీంతో కుల సమీకరణాలు ఎన్నికల ఫలితాలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఈ సామాజిక సమీకరణాలు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించనున్నాయి. ఖైరతాబాద్ పీఠం దక్కించుకోవడానికి మూడు పార్టీల మధ్య నడుస్తున్న పోరు రసవత్తరంగా మారింది.

