Saturday, September 26, 2026 01:56 PM
Saturday, September 26, 2026 01:56 PM

డ్రామాలు వద్దు.. వైఎస్ జగన్‌కు టీఎంసీ ఎంపీ స్లిప్పర్ షాట్..!

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలపై తీవ్రస్థానం విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలపై ప్రజలకు స్పష్టత ఉండాలని, రాజ్యాంగబద్ధ వ్యవస్థల తీరుపై నమ్మకం పెరగాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read : ఫామ్-6లో చిన్న మార్పు.. ఈసీ కొంప ముంచుతుందా..?

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు పరోక్షంగా సహకరిస్తూ, మళ్లీ ప్రజల ముందు రాజ్యాంగ వ్యవస్థల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీసే చర్యలకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని మహువా మొయిత్రా డిమాండ్ చేశారు. ప్రత్యేకించి రాబోయే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఒకవైపు కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, మరోవైపు రాజ్యాంగబద్ధ సంస్థల పనితీరుపై ప్రశ్నించినట్లు నటించడం కేవలం రాజకీయ ప్రదర్శన మాత్రమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : జనసేన గూటికి కీలక నేతలు.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకోవడానికి పోరాడుతుంటే, వైఎస్సార్‌సీపీ మాత్రం రెండు నాలికల ధోరణి అవలంబిస్తోందని మహువా మొయిత్రా విమర్శించారు. కేంద్రాన్ని నిజంగానే ప్రశ్నించే ఉద్దేశం ఉంటే.. ముందుగా వారి బిల్లులకు మద్దతు ఉపసంహరించుకోవాలని, అంతేతప్ప ప్రజల ముందు నాటకాలు ఆడవద్దంటూ చేసిన ఈ కౌంటర్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం ఈ ట్విట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

3,677 ఉద్యోగాలు.. మాయమైన...

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న DSC...

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

పోల్స్