Saturday, September 26, 2026 08:00 PM
Saturday, September 26, 2026 08:00 PM

దిగి వచ్చిన ఎన్నికల సంఘం.. కీలక నిర్ణయం..!

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల తొలగింపు ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అటు విపక్షాలు, ఇటు సామాన్యుల నుంచి వస్తున్న విమర్శలు, సామాన్యుల్లో నెలకొన్న అయోమయానికి కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. ఓటర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ సరికొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చారు. దీనివల్ల ఓటరు కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి పూర్తిగా తప్పనుంది.

Also Read : నేను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు.. కోహ్లీ కీలక ప్రకటన..!

చాలామంది ఓటర్లకు సిస్టమ్ జనరేటెడ్ నోటీసులు అందినప్పుడు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. అయితే, ఇలాంటి నోటీసులు వచ్చిన వారు ఎవరూ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ల కోసం వెతకాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. మీ పనులు వదులుకుని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం కానీ, అధికారుల కార్యాలయాల లైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పని కానీ ఇకపై ఉండదు. నోటీసులు జారీ అయిన ప్రతి ఓటరు చిరునామాను వెతుక్కుంటూ బీఎల్‌వోలే స్వయంగా వారి ఇళ్లకు వస్తారని సీఈసీ వెల్లడించారు.

Also Read : త్రిముఖ పోటీ ఖాయమేనా..?

క్షేత్రస్థాయి పరిశీలన మొత్తం ఓటరు ఇంట్లోనే జరుగుతుంది. ఓటరు దగ్గర నుంచి అవసరమైన గుర్తింపు పత్రాలు, ఇతర పత్రాలను సేకరించి, వాటిని ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే పూర్తి బాధ్యతను కూడా అధికారులకే అప్పగించారు. ఈ నిర్ణయం వల్ల ఓటర్లకు శ్రమ తగ్గడమే కాకుండా, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధమవుతుందని కమిషన్ భరోసా ఇచ్చింది. అటు సినీ ప్రముఖులు కూడా ఈ ప్రక్రియతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

జనసేన గూటికి కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల...

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

పోల్స్