Saturday, September 26, 2026 11:46 AM
Saturday, September 26, 2026 11:46 AM

రెండు రోజులు.. 21 హై-ప్రొఫైల్ మీటింగ్స్.. నారా లోకేష్ మెరుపు టూర్..!

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే కేవలం రెండు రోజుల వ్యవధిలో దేశ రాజధాని ఢిల్లీ, పారిశ్రామిక హబ్ అహ్మదాబాద్ నగరాల్లో ఆయన మెరుపు పర్యటనలు చేశారు. ఈ రెండు రోజుల్లో ఏకంగా 21 హై-ప్రొఫైల్ సమావేశాల్లో పాల్గొని ఏపీ బ్రాండ్ పవర్‌ను ప్రపంచానికి చాటిచెప్పారు లోకేష్. వివో, సిస్కో, అబాట్, మాస్టర్‌కార్డ్, ఎస్‌ఏపీ, గోద్రేజ్, టోరెంట్, వెల్స్‌పన్ వంటి 19 ప్రపంచ స్థాయి గ్లోబల్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

Also Read : పార్టీ అధ్యక్షుడి కంటే పెద్ద సారూ.. విజయసాయి రెడ్డి సంచలనం..!

ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి రాబోయే సరికొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఒక పక్కా రోడ్ మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హబ్, వైజాగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, నక్కపల్లిలో మెడికల్ డివైసెస్ పార్క్, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్లతో పాటు ఫార్మా, టెక్స్‌టైల్స్, సోలార్ రంగాలలో భారీ ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకురావడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేవలం పారిశ్రామిక రంగమే కాకుండా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో తీర ప్రాంతాల అభివృద్ధిపై, ఐసీసీ చైర్మన్ జై షాతో భేటీ అయి ఏపీని నేషనల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చే వ్యూహాత్మక అంశాలపై లోకేష్ సుదీర్ఘంగా చర్చించారు.

Also Read : ఫామ్-6లో చిన్న మార్పు.. ఈసీ కొంప ముంచుతుందా..?

“స్పీడ్ ఈజ్ మనీ… టైమ్ ఈజ్ మనీ” అనే నినాదంతో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్న లోకేష్.. కేవలం ఫ్యాక్టరీలు తీసుకురావడమే కాకుండా, వాటి ద్వారా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. సింగిల్ విండో అనుమతులు, పారదర్శక విధానాలతో పరిశ్రమల స్థాపనకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని లోకేష్ ఈ పర్యటన ద్వారా క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

3,677 ఉద్యోగాలు.. మాయమైన...

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న DSC...

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

పోల్స్