Saturday, September 26, 2026 11:49 AM
Saturday, September 26, 2026 11:49 AM

3,677 ఉద్యోగాలు.. మాయమైన రికార్డులు.. జగన్‌కు TV5 మూర్తి బిగ్ షాక్!

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న DSC నియామకాలపై రోజుకో స్టోరీ అల్లుతూ రోడ్డెక్కుతున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి టీవీ5 మూర్తి బిగ్‌షాక్ ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో చేసిన ఘోర అక్రమాలను మర్చిపోయి, ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ నేతల అసలు రంగును మూర్తి బట్టబయలు చేశారు. జగన్ హయాంలో జరిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపికలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరిట సాగిన దగాను ఆధారాలతో సహా ఎండగడుతూ వైసీపీకి పలు ప్రశ్నలు సంధించారు.

Also Read : వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ..!

జగన్ ప్రభుత్వంలో 2019-24 మధ్యకాలంలో స్పోర్ట్స్ కోటా కింద ఏకంగా 3,677 సచివాలయ నియామకాలు చేపట్టారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ (W&AE), పంచాయతీ సెక్రటరీ వంటి కీలక పోస్టులను ఈ కోటా ద్వారా భర్తీ చేశారు. తీరా ఇప్పుడు చూస్తే ఆ 3,677 ఉద్యోగాలకు సంబంధించిన క్రీడా ధ్రువీకరణ పత్రాల రికార్డులే మాయమవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అసలైన క్రీడాకారులను పక్కనబెట్టి, దొడ్డిదారిన నకిలీ సర్టిఫికెట్లు ఉన్న తమ సొంత మనుషులకు ఉద్యోగాలు కట్టబెట్టి, ఇప్పుడు ఆధారాలు దొరక్కుండా రికార్డులను మాయం చేశారని టీవీ5 మూర్తి ఆధారాలతో సహా నిలదీశారు.

ఈ దారుణ అక్రమాలపై డిబేట్ వేదికగా టీవీ5 మూర్తి సంధించిన ప్రశ్నలు జగన్ అండ్ కోకు నిద్రలేకుండా చేస్తున్నాయి. అసలు ఈ 3,677 పోస్టులకు సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఎవరు వెరిఫై చేశారు? ఏ క్రీడా సంఘాలు వాటిని జారీ చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస అర్హతల్లేని నకిలీ అభ్యర్థులకు పందారం చేసిన ఈ సర్టిఫికెట్ల రికార్డులు అసలు ఎక్కడికి పోయాయి? ఎందుకు మాయమయ్యాయో జగన్ ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. దేశానికి, రాష్ట్రానికి పేరు తెచ్చిన నిజమైన అథ్లెట్ల నోట్లో మట్టికొట్టి, తమ అనుచరులకు కొలువులు ఇచ్చుకున్న ఈ ఘోరమైన స్కామ్‌కు జగన్ బాధ్యత వహిస్తారా అని స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చారు.

Also Read : పార్టీ అధ్యక్షుడి కంటే పెద్ద సారూ.. విజయసాయి రెడ్డి సంచలనం..!

కోర్టులో సాక్ష్యాలు చూపలేక చివాట్లు తిన్నా మారని వైసీపీ నాయకులు, తమ హయాంలో జరిగిన ఈ 3,677 ఉద్యోగాల స్పోర్ట్స్ కోటా స్కామ్‌పై నోరు మెదపకపోవడం వారి నైతిక దివాళాకోరుతనానికి నిదర్శనం. నిరూపించలేని ఆరోపణలతో వీధుల్లో డ్రామాలు ఆడడం మానేసి, సచివాలయ నియామకాల్లో సాగిన ఈ స్పోర్ట్స్ కోటా దోపిడీపై, మాయమైన రికార్డులపై జగన్ ముందుగా నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.

సచివాలయ ఉద్యోగాల స్పోర్ట్స్ కోటా స్కామ్ సాక్షిగా వైసీపీ అసలు స్వరూపం బయటపడింది. తమ పాలనలో క్రీడాకారులకు చేసిన ఘోరమైన అన్యాయాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు DSC నియామకాలపై లేనిపోని రచ్చ చేస్తున్నారనేది స్పష్టమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రెండు రోజులు.. 21...

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా దేశంలోనే నెంబర్ వన్...

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

పోల్స్