Monday, September 28, 2026 12:01 PM
Monday, September 28, 2026 12:01 PM

విజయవాడ ధర్నా చౌక్ హైడ్రామా.. సీఐ మృతి కేసులో సంచలనం..!

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన బందోబస్తు విధుల్లో ఉన్న నున్న సీఐ తీవ్ర అస్వస్థతతో కుప్పకూలి, ఆపై కన్నుమూసిన ఘటన ఏపీవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట ఆయన గుండెపోటుతోనే మరణించారని అందరూ భావించినప్పటికీ, ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ ఘోర పరిణామాన్ని కేవలం సహజ మరణంగా భావించలేమని, దీని వెనుక నిరసనకారుల తోపులాట ఉందనే అనుమానంతో పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు.

Also Read: దిగి వచ్చిన ఎన్నికల సంఘం.. కీలక నిర్ణయం..!

ఆదివారం విజయవాడ ధర్నా చౌక్ పరిసరాలు నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికాయి. శాంతిభద్రతలను కాపాడే క్రమంలో నున్న సీఐ తన సిబ్బందితో కలిసి అక్కడే విధుల్లో ఉండగా, నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఒక్కసారిగా తీవ్రస్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాట మధ్యలోనే సీఐ కిందపడిపోయి కుప్పకూలగా, సహచర సిబ్బంది వెంటనే స్పందించి సమీపంలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యులు ఆయనకు సీపీఆర్ చేసి కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Also Read : త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఈ విషాద ఘటన జరిగిన కొద్దిసేపటికే.. నాడు విధుల్లో సీఐ పక్కనే ఉన్న ఒక కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారుల తోపులాట వల్లే సీఐ కిందపడ్డారని, ఆ సమయంలో జరిగిన తీవ్ర భౌతిక, మానసిక ఒత్తిడి వల్లే ఆయన మరణించి ఉండవచ్చని సదరు కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ, పోలీస్ వర్గాలన్నీ మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తేల్చే పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్...

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో...

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

డ్రామాలు వద్దు.. వైఎస్...

గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్...

పోల్స్