Monday, September 28, 2026 02:22 PM
Monday, September 28, 2026 02:22 PM

ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ పాలనకు రిఫరెండమా..?

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. నాగేందర్‌కు బదులుగా క్లీన్ ఇమేజ్ ఉన్న కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుందనే చర్చ ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అందులో భాగంగా సమర్థులైన లీడర్లు ఎవరు ఉన్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. దానంకు ఉప ఎన్నికలు కలిసి రావనే టాక్ ఉంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ నుంచి దానం కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ నాడు కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు వల్ల ఆ నియోజకవర్గం గులాబీ పార్టీకి వెళ్లగా, దానం రాత్రికి రాత్రే తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దానం కాంగ్రెస్ తరపున పోటీ చేసినా.. విజయం సాధించలేదు.

Also Read : పెద్దల సభకు రాజకీయ సమరం..!

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఖైరతాబాద్ సెగ్మెంట్‌లో కిషన్ రెడ్డికి దానం కంటే 16 వేల ఓట్లు అధికంగా వచ్చాయి. ఖైరతాబాద్ నుంచి దానం గెలిచే అవకాశాలు లేవని నిర్ధారణకు కాంగ్రెస్ అధిష్టానం వస్తే, అక్కడి నుంచి కొత్త వ్యక్తిని బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు పరిహారంగా నాగేందర్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం నాగేందర్ కష్టపడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించిన తర్వాత మున్నూరు కాపు వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదనే విమర్శలకు చెక్ పెట్టొచ్చనే అభిప్రాయంలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది.

Also Read : తెనాలి మాజీ ఎమ్మెల్యే గారి చీటింగ్ లీలలు..!

ఉప ఎన్నికల్లో దానంకు బదులుగా ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు సులువుగా ఉంటుందనే కోణంలో కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం. 2023లో బీఆర్ఎస్ నుంచి దానం 22వేల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విజయారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఉప ఎలక్షన్‌లో ఆమెకు టికెట్ ఇస్తే ఏ మేరకు విజయావకాశాలు ఉంటాయని ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న రోహిణ్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దానం గురించి స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారో అని తెలుసుకునేందుకు ప్రత్యేక సర్వే చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Also Read : విజయవాడ ధర్నా చౌక్ హైడ్రామా.. సీఐ మృతి కేసులో సంచలనం..!

దానం సభ్యత్వం రద్దు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసినట్లు తెలిసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నిక ఖాయమైంది. వచ్చే ఏడాది మార్చి లోపు ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవడం మంచిదనే అభిప్రాయంలో అధిష్టానం పెద్దలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, దానం పరిస్థితిపై సర్వేలు జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెద్దల సభకు రాజకీయ...

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి...

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్...

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో...

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

పోల్స్