Thursday, October 1, 2026 01:13 PM
Thursday, October 1, 2026 01:13 PM

నారా లోకేష్ ధైర్యానికి ఫిదా అయిన రాజ్‌దీప్ సర్దేశాయ్..!

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై దేశంలోనే అత్యంత సీనియర్, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్‌లో లోకేష్‌ను ఇంటర్వ్యూ చేసిన అనంతరం, రాజ్‌దీప్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా లోకేష్ రాజకీయ పరిణతిని, ధైర్యాన్ని అభినందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రోజుల్లో ముందస్తు స్క్రిప్ట్‌లు, ఈజీ పిచ్‌లు ఆశించే నేతల మధ్య లోకేష్ ఒక అరుదైన మినహాయింపుగా నిలిచారని ఆయన స్పష్టం చేశారు.

Also Read : ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు..!

“ఒక రాజకీయ నాయకుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు ప్రశ్నలను అడ్వాన్స్‌గా అడగకుండా, ఏ అంశంపైనైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు పని చాలా సులువవుతుంది” అని రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో ఇంటర్వ్యూల దరఖాస్తు ఇలాగే ఉండేదని, కానీ దురదృష్టవశాత్తూ ఇప్పుడు ముందే ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం ఒక సంప్రదాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో లోకేష్‌ను చూసి దేశంలోని ఇతర నాయకులంతా ఖచ్చితంగా నేర్చుకోవాలని ఆయన సూచించారు.

Also Read : ఆ పిల్లాడి బాధ్యత నాది.. లోకేష్ కీలక ప్రకటన..!

తాను సంధించిన అత్యంత కఠినమైన ప్రశ్నలకు కూడా లోకేష్ ఏమాత్రం తడబడకుండా, చాలా సూటిగా మరియు కుండబద్దలు కొట్టినట్లు సమాధానాలు ఇచ్చారని రాజ్‌దీప్ ప్రశంసించారు. ఈ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత మంత్రి నారా లోకేష్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “బిజినెస్‌లోనే అత్యంత కఠినమైన జర్నలిస్టులలో ఒకరైన రాజ్‌దీప్ సర్దేశాయ్ నుండి ఎలాంటి స్క్రిప్ట్‌లు, ఈజీ పిచ్‌లు లేకుండా కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొన్నాను” అని తెలిపారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ అభివృద్ధి వ్యూహాలతో పాటు, దేశ రాజకీయాలు, సుపరిపాలన మరియు భవిష్యత్తు ప్రణాళికలపై చాలా స్పష్టమైన పంథాలో చర్చ సాగిందని లోకేష్ పేర్కొన్నారు. జాతీయ స్థాయి కాంక్లేవ్‌లో ఒక సీనియర్ జర్నలిస్ట్ చేత ఏపీ మంత్రి ఇంతటి ప్రశంసలు అందుకోవడం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

ఏపీ స్థానిక ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతోన్న స్థానిక సంస్థల...

ఆ పిల్లాడి బాధ్యత...

గొర్రెలు కాస్తున్న ఒక చిన్నారి దయనీయ...

విశాఖ మెట్రోకు గ్రీన్...

ఏపీలో విశాఖ అతి పెద్ద నగరం....

కొత్త ఓటర్లకు గుడ్...

దేశంలో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను...

జగన్‌ను జైల్లో పెట్టిన...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న...

పోల్స్