Thursday, October 1, 2026 05:21 PM
Thursday, October 1, 2026 05:21 PM

BC రిజర్వేషన్లపై వైసీపీ కుట్ర.. గంటలో సుప్రీంకి ఏపీ సర్కార్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టులో కేసులు వేసింది వైసీపీకి చెందిన వ్యక్తులేననే మరోసారి స్పష్టమైంది. ఒకవైపు తామే బీసీల కొమ్ము కాస్తున్నామని చెప్తూనే, మరోవైపు తమ పార్టీ అనుకూల వ్యక్తుల ద్వారా న్యాయస్థానంలో పిటిషన్లు వేయించి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కకుండా అడ్డుపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : ఏపీ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు..!

బీసీల 34% రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పి. వెంకట నరసింహ శర్మ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది గండాల శివప్రసాద్ రెడ్డి నేపథ్యం దీనికి ప్రధాన ఆధారంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌-AGPగా పనిచేసిన శివప్రసాద్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలతో ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో తెరవెనుక ఉండి వైసీపీయే ఈ కేసులను నడిపిస్తోందనే ఆరోపణలకు బలం చేకూరింది.

గతంలో కూడా జగన్ మోహన్ రెడ్డి ఇదే తరహా డబుల్ గేమ్‌ ఆడారనే విమర్శలు ఉన్నాయి. ముందు నుండి BCలను కౌగలించుకున్నట్లు నటిస్తూనే, వెనుక నుండి బిర్రు ప్రతాప రెడ్డితో కోర్టుల్లో కేసులు వేయించి బీసీలకు వెన్నుపోటు పొడిచారని, వారి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాశారని బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పాత కుట్రకు తెరలేపి బీసీలకు రాజకీయ అవకాశం దక్కకుండా చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : నారా లోకేష్ ధైర్యానికి ఫిదా అయిన రాజ్‌దీప్ సర్దేశాయ్..!

వైసీపీ డబుల్ గేమ్‌ను ఎండగడుతూ పలు బీసీ సంఘాలు, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పైకి BC ప్రేమికులుగా నటిస్తూ, లోపల లాయర్ల ద్వారా కోర్టుల్లో కేసులు వేయించి రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టించడం వైసీపీ నైజానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. స్థానిక పోరులో బీసీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన 34% అవకాశాలను కాలరాసేందుకు ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా BCలకు 34% రిజర్వేషన్లు ఇచ్చే తీరాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. హైకోర్టులో ఎదురైన న్యాయపరమైన చిక్కులను అధిగమించి బీసీల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టులో గట్టిగా వాదనలు వినిపించి, వైసీపీ కుట్రలను ఛేదించి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

ఏపీ స్థానిక ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతోన్న స్థానిక సంస్థల...

ఆ పిల్లాడి బాధ్యత...

గొర్రెలు కాస్తున్న ఒక చిన్నారి దయనీయ...

విశాఖ మెట్రోకు గ్రీన్...

ఏపీలో విశాఖ అతి పెద్ద నగరం....

పోల్స్