Friday, July 3, 2026 11:42 AM
Friday, July 3, 2026 11:42 AM

జగన్ మైండ్ గేమ్.. వెరీ డేంజర్.. బీ అలర్ట్..!

మ‌నం మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే.. శ‌త్రువును బ‌ల‌హీన‌ప‌ర్చాలి. అది జ‌ర‌గాలంటే వారి హ‌యాంలో స్టేట్ డెవ‌ల‌ప్ కాకూడ‌దు.. అది జ‌రిగితే శ‌త్రువు బ‌ల‌ప‌డ‌తాడు. అది జ‌ర‌గ‌కూడ‌దంటే రాష్ట్రాన్ని కూడా కూడా బలహీనపరచాలి.. ప్ర‌జ‌ల భ‌విష్య‌త్ కూడా ప‌ణంగా పెట్టేసి మ‌రీ. ఇదే కాన్సెప్ట్ మాజీ సీఎం జ‌గ‌న్ పాలో అవుతున్నారా.. అంటే అవున‌నే అనిపిస్తోంది. లేక‌పోతే అమ‌రావ‌తి నిల‌బడితే తెలుగుదేశం నిల‌బ‌డుతుంద‌నే భ‌యంతో గ‌తంలో దానిని ఆపేసి మూడు రాజ‌ధానుల‌నే కాన్సెప్ట్ తెచ్చారు. ల‌క్ష్యం క్లారిటీ ఉంది గాని.. ఎలా చేయాలో క్లారిటీ లేదు కాబ‌ట్టి అందులో ఫెయిల‌య్యారు. చివ‌ర‌కు ఓట‌మి పాలై అధికారం పోగొట్టుకున్నారు. విధానాలు, నిర్ణ‌యాల‌న్నీ తెలుగుదేశం పార్టీ ఎలా ఆపాల‌నే దాని నుంచే పుట్టాయి కాబ‌ట్టే అవి ఫెయిల్ అయ్యాయి. కాని మ‌ళ్లీ అదే ఫార్ములాను జగన్ ఫాలో అవుతున్నారని రాజ‌కీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : సాయికృష్ణ మృతి కేసులో సంచలన మలుపు..!

అందుకే ఇప్పుడు మావిగ‌న్ అనే పేరు ఎత్తుకున్నారు. తొలి రోజుల్లో ఇదంతా ఓ జోక్ అని అంతా తీసుకున్నారు. కాని దాని వెన‌క ఉన్న సీరియ‌స్ ఎజెండా జ‌గన్‌కి మాత్ర‌మే తెలుసు. మావిగ‌న్ అనేది తెరపైకి వ‌స్తే అమ‌రావ‌తి వీక్ అవుతుంది. అప్పుడు అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టాలనుకునేవారిలో భయం పెరుగుతుంది. ఇప్ప‌టికే “మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌స్తే..?” అనే భ‌యం పెట్టుబ‌డిదారుల‌ను వెంటాడుతూనే ఉంది. దానికి తోడు ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు వారిలో మ‌రింత అనుమానాలను పెంచుతోంది. ఒక ర‌క‌మైన మైండ్ గేమ్ ఆడుతున్నారు జ‌గ‌న్ అనే అంచ‌నాకు వ‌స్తున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. మావిగ‌న్ అంటే మాకు.. అమరావ‌తి అంటే చంద్ర‌బాబుకు ఓటేయండి అని అంటున్నారు. అంటే జ‌గ‌న్‌కు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా చెబుతారు.. అంటే మ‌ళ్లీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తారా అనే అనుమానం క‌లిగించ‌డ‌మే ఈ ప్ర‌క‌ట‌న వెన‌క ఉన్న ల‌క్ష్యం అంటున్నారు.

Also Read : ఆ విషయంలో మోదీ సైలెన్స్.. కాంగ్రెస్ ఫైర్..!

కూట‌మి ప్ర‌భుత్వంలో త‌ప్పులు జ‌ర‌గ‌టం లేదా అంటే కాద‌ని చెప్ప‌లేం. క‌చ్చితంగా కొన్ని వ్య‌వ‌హారాల్లో త‌ప్పులు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలి బాగోలేద‌నే ఆరోప‌ణ‌లు గ‌ట్టిగా వ‌స్తున్నాయి. ఈ మాటను అధినేత చంద్రబాబు కూడా పలుమార్లు స్వయంగా వ్యాఖ్యానించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వాటిని హైలెట్ చేయ‌డం లేదు. జ‌గ‌న్ కూడా వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏవైతే కూట‌మి త‌మ విజ‌యాలుగా చెప్పుకుంటుందో వాటినే టార్గెట్ చేస్తున్నారు. విశాఖ డేటా సెంట‌ర్ పై అలిసిపోయేలా అష్టావ‌ధానం చేశారు. ముందు తామే తెచ్చామ‌న్నారు. జ‌గ‌న్ అలా చెప్పి.. త‌న పార్టీ నాయ‌కుడితోనే డేటా సెంట‌ర్‌తో డేంంజ‌ర్ అని చెప్పించారు. డీఎస్సీ నిర్వహిస్తే అందులో కేవ‌లం స్పోర్ట్స్ కోటాలోనే ఏదో జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. దానిపై ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తూ విసుగు తెప్పించార‌నే చెప్పాలి. ప్ర‌భుత్వం ప‌దే ప‌దే వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!

మొద‌ట 11 సీట్ల‌కే ప‌రిమిత‌మై సైలెంట్ అయిన వైసీపీ.. క్ర‌మంగా బ‌ల‌ప‌డిన‌ట్లు క‌న‌ప‌డుతుంద‌ని అనిపించాల‌నేదే ఈ ప్ర‌చారాల వెన‌క వ్యూహం అంటున్నారు. జ‌గ‌న్ పై అభిమాన‌మున్న‌ వాళ్లు ఈ వ్య‌వ‌హార శైలిని స‌మ‌ర్ధించుకుంటూ .. “అదీ మావాడు.. కూట‌మిని ముప్ప‌తిప్పులు పెడుతున్నాడు.. ఈసారి మావాడిదే అధికారం..” అని ఇప్పటి నుంచే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆఖ‌రికి కూట‌మిని బ‌ల‌ప‌ర్చేవాళ్లు సైతం ఈసారి మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌స్తాడంటారా.. అని కొందరంటుంటే.. వస్తాడంట క‌దా.. అని మరి కొందరు అనుకుంటున్నారు. మొన్న ఎన్నిక‌ల ముందు కూడా ఇలాంటి ప్ర‌చార‌మే జ‌ర‌గ‌గా.. వ‌చ్చిన ఫలితాల‌కు అంద‌రూ షాక్ అవ్వాల్సి వ‌చ్చింది. అందుకే ప్ర‌చారం ఒక‌టైతే.. వాస్త‌వం మ‌రోలా ఉంటుంది. అది ఎటైనా కావొచ్చు. 2019లో కూడా తెలుగుదేశం వాళ్లు మ‌ళ్లీ గెలుస్తామ‌ని దీమాగా ఉంటే ఏమైందో ఫలితాలు అందరికీ తెలుసు. 2024లో అదే రివ‌ర్స్ అయింది.

జ‌గ‌న్ ప్ర‌చార వ్యూహం కూడా త్రిశూల వ్యూహంలా మూడు వైపుల నుంచి న‌డుస్తోంది. ఒక‌టి పార్టీ నుంచి.. రెండు త‌మ ఫాలోవ‌ర్ చానెల్స్ నుంచి.. మూడు సోష‌ల్ మీడియా నుంచి. చాప కింద నీరులా వైసీపీ త‌న వ్యూహాన్ని అమ‌లు చేస్తుంద‌ని అర్ధ‌మ‌వుతోంది. యూట్యూబ‌ర్స్ ఎవ‌రు ఏ స‌మ‌యంలో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారో.. ఏం చెబుతున్నారో చూస్తుంటే.. వారి వెన‌క వైసీపీ ఉన్న‌ట్లు తెలుస్తోంది అంటున్నారు టీడీపీ నేతలు. ఎక్క‌డ అల‌జ‌డి రేగినా.. ఎక్క‌డ కుల మ‌తాల మ‌ధ్య చిచ్చు ర‌గిలినా.. అన్నిటి వెన‌క వైసీపీ హ‌స్తం ఉంద‌ని అంటున్నారు. విజ‌య‌వాడ సీఐ నాగ‌రాజు, సాయి క్రిష్ణ వ్య‌వ‌హారంలో అదే క‌న‌ప‌డింది. దీనిని ప‌ట్టుకుని కాపుల‌పై నిర్ల‌క్ష్యం అనే యాంగిల్ తెచ్చారు. ఇక ఇప్పుడు లేటెస్టుగా యూట్యూబ‌ర్స్ ఇద్ద‌రి అరెస్టు జ‌రిగితే.. దానికి ప్రాంతం, కులం అంటిస్తున్నారు. వారు ఆయా వీడియోల్లో ఎలా మాట్లాడారు.. ఏం మాట్లాడార‌నేది వ‌దిలేసి అరెస్టు గురించి మాత్ర‌మే మాట్లాడుతున్నారు.

కాక‌పోతే జ‌గ‌న్ గ‌మ‌నించాల్సింది చ‌రిత్ర అంటున్నారు కూట‌మి వారు. కాపుల‌ను రెచ్చ‌గొడితే వారంతా ప‌వ‌న్ వెన‌క చేరార‌ని.. ఇప్పుడు కూడా కాపుల స‌మావేశాల‌ని పెడితే.. కాపులంతా ఐక్యంగా క‌దిలేలా చేశార‌ని అంటున్నారు. అలాగే ఇప్పుడు ద‌ళిత క్రైస్త‌వుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని.. వారిలోనూ ఇప్పుడు చీలిక రాక త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఏమైనా అధికారం కోసం వ్యూహాలు ప‌న్నేట‌ప్పుడు జగన్ ఫైనల్ గోల్ మాత్రం ఒకటే.. అది కేవలం స్వార్థం మాత్రమే అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

సీఎంఓ‌లోకి మరో జగన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వైసీపీ అభిమాన...

తమిళ రాజకీయాల్లో సంచలనం.....

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ...

పోల్స్