Saturday, October 10, 2026 10:20 AM
Saturday, October 10, 2026 10:20 AM

భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!

రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్వర్క్‌ ను మరింత బలోపేతం చేయడం మరియు ప్రతి పౌరుడికి డిజిటల్ సేవలను చేరువ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి ఐటీ శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర టెలికాం శాఖ ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తో పాటు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో టెలికాం రంగాన్ని ఆధునీకరించడం, సాంకేతిక అవరోధాలను తొలగించడంపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.

Also Read : తమిళ రాజకీయాల్లో సంచలనం.. ప్రభుత్వం కూల్చే కుట్ర భగ్నం..!

రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామం లేదా మారుమూల ప్రాంతం కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్‌ కు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ సరైన సిగ్నల్ కవరేజ్ లేని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలను గుర్తించి అక్కడ తక్షణమే నెట్వర్క్ సౌకర్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన చోట్ల యుద్ధప్రాతిపదికన మరిన్ని కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు దిశానిర్దేశం చేశారు. టవర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ప్రభుత్వం తరఫున వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read : రంగంలోకి రేవంత్ టీమ్.. రెడీ..!

రాష్ట్రంలో కేవలం సాంకేతిక వసతులు కల్పించడమే కాకుండా, ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మనమిత్ర సేవలను ప్రజలకు మరింత సులువుగా చేర్చడంలో టెలికాం సంస్థలు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు, మహిళలకు డిజిటల్ సాధనాల వినియోగం, ఆన్‌లైన్ సేవలు, సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వంతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్