వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. అయితే, ముద్రగడ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి రోజులు గడుస్తున్నా.. జగన్ నేరుగా రాకపోవడంపై సర్వత్రా వెల్లువెత్తిన తీవ్ర విమర్శల నేపధ్యంలోనే, ఈ పర్యటనతో డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Also Read : స్కూల్స్ లో ఎలక్షన్స్.. విజయ్ సంచలన నిర్ణయం..!
ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు తన పేరును కూడా మార్చుకుంటానని సవాల్ చేసి, వైసీపీ కోసం తీవ్రంగా శ్రమించిన వ్యక్తి ముద్రగడ. అలాంటి నేత ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉంటే, జగన్ కనీసం స్వయంగా వచ్చి పరామర్శించకపోవడాన్ని కాపు సామాజికవర్గం తీవ్రంగా తప్పుబట్టింది. సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో జగన్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. మొదట్లో జగన్ తన ముఖ్య అనుచరుడైన సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రమే ఆసుపత్రికి పంపి మమ అనిపించారని, కానీ ఆ ప్రయత్నం విమర్శల వేడిని చల్లార్చలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : శాసిస్తున్న వైసీపీ మాజీ మంత్రి..!
సొంత పార్టీకి అండగా నిలిచిన సీనియర్ నేతలను జగన్ పట్టించుకోరనే ముద్ర పడకుండా ఉండేందుకే ఇప్పుడు ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముద్రగడను జగన్ పూర్తిగా వదిలేశారు అనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మరియు కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత రాకుండా కవర్ చేయడానికే ఈ చివరి నిమిషం నిర్ణయమని విమర్శలు వస్తున్నాయి. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉండేలా చూసేందుకు మరియు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చేందుకు జగన్ వెళ్తున్నప్పటికీ, ఈ లేట్ పర్యటన వెనుక రాజకీయ అవసరాలు, ఎదురైన విమర్శలను కవర్ చేసుకునే వ్యూహమే ప్రధానంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

