Friday, June 19, 2026 09:01 PM
Friday, June 19, 2026 09:01 PM

ప్రోటీన్ పౌడర్లు మీ కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయా..?

ప్రస్తుత కాలంలో జిమ్‌ కు వెళ్లే యువత, ఫిట్నెస్ ప్రేమికుల్లో ప్రోటీన్ పౌడర్లు వాడకం ఒక నిత్యావసరంగా మారిపోయింది. బాడీ బిల్డింగ్, కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అవసరమే అయినప్పటికీ.. పరిమితికి మించి ఈ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల తెలియకుండానే కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నిశాంత్ నాగపాల్ హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఏ ఇతర అనారోగ్య కారణాలు లేకుండానే, కేవలం అధిక మోతాదులో ప్రోటీన్ సప్లిమెంట్లు వాడటం వల్ల కాలేయ ఎంజైములు పెరిగి లివర్ దెబ్బతిన్న యువ రోగుల సంఖ్య ఆసుపత్రుల్లో ఆందోళనకరంగా పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

Also Read : బ్రేకింగ్: కొడాలి అరెస్ట్ కు రంగం సిద్దం..?

మనం ఆహారం లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకునే ప్రతి గ్రాము ప్రోటీన్‌ను కాలేయమే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. శరీర అవసరానికి మించి కాన్సంట్రేటెడ్ ప్రోటీన్ పౌడర్లను పదే పదే తీసుకున్నప్పుడు కాలేయంపై పనిభారం విపరీతంగా పెరుగుతుంది. ప్రోటీన్ జీర్ణక్రియలో భాగంగా ఉత్పత్తయ్యే అమ్మోనియాను యూరియాగా మార్చే ప్రక్రియలో కాలేయ కణాలు తీవ్ర ఒత్తిడికి లోనై వాపుకి దారితీస్తాయి. దీనికి తోడు మార్కెట్లో దొరికే కొన్ని నాణ్యత లేని ప్రోటీన్ పౌడర్లలో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు, సీసం, ఆర్సెనిక్ వంటి హెవీ మెటల్స్, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లేని కెమికల్స్ డ్రగ్-ఇండ్యూస్డ్ లివర్ ఇంజూరీకి కారణమవుతున్నాయి.

ఇప్పటికే ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ సమస్యలు ఉన్నవారికి ఈ సప్లిమెంట్లు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. సురక్షితంగా ప్రోటీన్ సప్లిమెంట్లను వాడటానికి వైద్యులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. సాధారణంగా శారీరక శ్రమ తక్కువగా ఉండే వయోజనులకు రోజుకు ప్రతి కిలో బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ సరిపోతుంది. క్రమం తప్పకుండా జిమ్ చేసే వారికి కూడా 1.2 నుంచి 1.6 గ్రాములు/కిలో సరిపోతుంది. మీ రోజువారీ ఆహారం ద్వారా ఎంత లభిస్తుందో లెక్కించుకున్నాకే సప్లిమెంట్లు వాడాలి.

Also Read : బ్రేకింగ్: అల్లు అర్జున్‌ కు నాంపల్లి కోర్టు షాక్..!

అలాగే మార్కెట్లో లభించే నాణ్యత లేని ఆన్‌ లైన్ ప్రొడక్ట్స్ వాడకుండా.. థర్డ్ పార్టీ పరీక్షలు పూర్తి చేసుకుని ల్యాబ్ నివేదికలు స్పష్టంగా ఉన్న బ్రాండెడ్ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. ఒకేసారి ఎక్కువ ప్రోటీన్ తీసుకోకుండా ఒక స్కూప్ (20-25 గ్రాములు) మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే మన శరీరం ఒకేసారి అంతే మొత్తాన్ని సమర్థవంతంగా గ్రహించగలదు. వీటితో పాటు ప్రోటీన్ పౌడర్లను భోజనానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడూ తీసుకోకూడదు. గుడ్లు, పప్పుధాన్యాలు, మాంసం, పాలు వంటి సహజ ఆహారాల ద్వారా వచ్చే మైక్రోన్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు సప్లిమెంట్లలో దొరకవు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్