Saturday, September 19, 2026 05:59 AM
Saturday, September 19, 2026 05:59 AM

టీమిండియాలో షమీ శకం ముగిసినట్లేనా..?

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌ పునరాగమనంపై సంచలన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. 2023 వన్డే ప్రపంచకప్‌ లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ సీనియర్ పేసర్‌ కు, భారత జట్టు తలుపులు దాదాపు మూసుకుపోయినట్లేనని ఒక జాతీయ మీడియా నివేదిక స్పష్టం చేసింది. భవిష్యత్తు సిరీస్‌ ల కోసం సెలెక్షన్ కమిటీ తీసుకున్న సరికొత్త నిర్ణయాలు దీనిని బలాన్ని చేకూరుస్తున్నాయి. నివేదికల ప్రకారం.. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ సైకిల్ మరియు 2027 వన్డే ప్రపంచకప్‌ ను దృష్టిలో ఉంచుకుని యువ రక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది.

Also Read : ఏపీ సహా 3 రాష్ట్రాలపై విజయ్ ఆంక్షలు..!

మూడు ఫార్మాట్లలో భారత పేస్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు సెలెక్టర్లు 15 మంది యువ ఫాస్ట్ బౌలర్లతో కూడిన ఒక ప్రత్యేక పూల్ ను సిద్ధం చేశారు. దురదృష్టవశాత్తూ, భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా రూపొందించిన ఈ 15 మంది జాబితాలో మహ్మద్ షమీ పేరు లేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత షమీ సెలెక్టర్ల నుంచి పెద్దగా మద్దతు పొందలేకపోయాడు. గాయాల నుంచి కోలుకుని, దేశీవాళీ క్రికెట్‌ లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఆయనకు జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

Also Read : ఏపీలో ఐషర్ మోటార్స్ ఎంట్రీ.. భారీ పెట్టుబడి..!

తాజాగా శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌ కు కూడా షమీని పక్కన పెట్టడంతో, సెలెక్టర్లు సీనియర్ల స్థానంలో యువ పేసర్లకు అంతర్జాతీయ అనుభవాన్ని అందించేందుకే మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు స్పష్టమయ్యాయి. అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న మహ్మద్ షమీ లాంటి సీనియర్ బౌలర్‌ ను జట్టు మేనేజ్మెంట్ పూర్తిగా పక్కన పెట్టడంపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మొహ్సిన్ ఖాన్ వంటి యువ బౌలర్లు మంచివారే, వారిని తక్కువ అంచనా వేయలేం. రాబోయే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది. కానీ, షమీ లాంటి ఒక అసాధారణమైన సీనియర్ బౌలర్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ ఏమీ కాకుండా చేసేయడం నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది” అంటూ శ్రీకాంత్ ఒక స్పోర్ట్స్ ఛానెల్‌ లో మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్