Friday, July 31, 2026 12:33 AM
Friday, July 31, 2026 12:33 AM

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

దేశంలో లిఫ్ట్ ప్రమాదాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. లిఫ్ట్‌లలో జరిగే ప్రమాదాలకు కేవలం ఒకరినే బాధ్యులను చేయడానికి వీల్లేదని.. లిఫ్ట్ తయారీ సంస్థ, దానిని నిర్వహించే ఏజెన్సీ, మరియు సదరు భవన యజమాని.. ఈ ముగ్గురిదీ ఉమ్మడి బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. నగరాలు ఇప్పుడు అడ్డంగా కాకుండా నిలువుగా అంటే అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలుగా విస్తరిస్తున్నాయని సుప్రీం పేర్కొంది.

Also Read : సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై దుమారం..!

ఆధునిక పట్టణ జీవితంలో లిఫ్ట్‌లు ఒక ముఖ్యమైన భాగమయ్యాయని సుప్రీంకోర్టు తెలిపింది. లిఫ్ట్‌లను రైళ్లు, బస్సుల వంటి ఒక రకమైన ప్రజా రవాణా వ్యవస్థ గానే పరిగణించాలని కోర్టు అభిప్రాయపడింది. ప్రజలు ఒక చిన్న స్టీల్ క్యాబిన్‌ లోకి అడుగుపెట్టి తలుపులు మూసుకున్నప్పుడు, తమకు ఎలాంటి నియంత్రణ లేని ఒక యాంత్రిక వ్యవస్థపై పూర్తి నమ్మకంతో తమ ప్రాణాలను అప్పగిస్తారని, అందువల్ల ప్రయాణికుల భద్రతను నిర్ధారించాల్సిన బాధ్యత సంబంధిత సంస్థలపై మరింత ఎక్కువగా ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read : డీఎస్సీ పరీక్ష.. రాజకీయాల కోసమా? లేక ఉద్యోగార్థుల కోసమా?

ప్రమాదం జరిగినప్పుడు ఏ పార్టీ తప్పు ఎంత ఉందో వెతకాల్సిన అవసరం వినియోగదారుడికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితులు బాధ్యులైన ఏ ఒక్క సంస్థ నుంచైనా పూర్తి పరిహారాన్ని క్లెయిమ్ చేయవచ్చని, ఆ తర్వాత సంబంధిత సంస్థలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుని ఎవరి వాటా ఎంత అనేది తేల్చుకోవాలని కోర్టు వివరించింది. ఈ కేసు 2003లో దిల్లీలోని రా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ప్రమాదానికి సంబంధించింది. ఆ ప్రమాదంలో మాజీ దౌత్యవేత్త విపిన్ హండా లిఫ్ట్‌ లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ 2014లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఓటిస్ ఎలివేటర్ కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ, బాధిత కుటుంబానికి ₹3.01 కోట్ల పరిహారాన్ని 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇంటింటికి టీడీపీ.. కూటమిలో...

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు...

వారానికి ఒకసారి ‘చికెన్...

తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆ...

ఏపీలో ఐషర్ మోటార్స్...

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి మరో గుడ్...

బ్రేకింగ్: సీఎం రేవంత్...

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి...

వంగవీటి రాధా రాజకీయ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి అనే పేరుకు...

నేనేంటో నా భర్తకు...

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా...

పోల్స్