శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాడ మాసం, బహుళ పక్షం.. 01-08-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..
మేషం
నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
—————————————
వృషభం
చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.
—————————————
మిధునం
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
—————————————
కర్కాటకం
ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
—————————————
సింహం
ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
—————————————
కన్య
చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
—————————————
తుల
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన ఋణయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
—————————————
వృశ్చికం
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.
—————————————
ధనస్సు
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
—————————————
మకరం
కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
—————————————
కుంభం
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.
—————————————
మీనం
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు చేజారుతాయి.
————————————-
గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

