Saturday, September 19, 2026 07:41 AM
Saturday, September 19, 2026 07:41 AM

ఉరవకొండలో పొలిటికల్ హీట్.. మాజీ ఎంపీ అరెస్ట్..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉరవకొండలో భారీగా పోలీసులను మోహరించారు. ఉరవకొండలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

Also Read : ఢిల్లీ పోలీస్ లపై అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు..!

ఈ క్రమంలోనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పెనుకొండలో మాజీ మంత్రి శంకర నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు ఉరవకొండకు రాకుండా నిలువరించేందుకు పోలీసు యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం గుంతకల్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్-30 అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉరవకొండలో ఎలాంటి ర్యాలీలు, నిరసనలు, ధర్నాలకు ముందస్తు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

నిబంధనలను అతిక్రమించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వై. విశ్వేశ్వర్‌ రెడ్డి పోలీసుల ఆంక్షలపై మండిపడ్డారు. దేవాలయ భూముల పరిరక్షణే ధ్యేయంగా తాము ఉరవకొండలో ఖచ్చితంగా ధర్నా నిర్వహించి తీరుతామంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారడంతో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Also Read : చంద్రబాబు రాజనీతి… అసలు లెక్క ఇదే!

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సైతం ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, అక్రమ కేసులకు వ్యతిరేకంగా టీడీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇరు పార్టీల నేతలు ఒకే రోజు నిరసనలకు సిద్ధమవడంతో ఉరవకొండలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఉరవకొండలో అదనపు బలగాలతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్