దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భద్రతా ప్రమాణాల్లో మరోసారి తన మార్కును నిరూపించుకుంది. సంస్థకు చెందిన సరికొత్త 2026 టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ మోడల్.. ప్రతిష్టాత్మక భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ లో అత్యుత్తమ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కైవసం చేసుకుంది. భారత్ లో విక్రయించబడుతున్న సేఫెస్ట్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లో ఇది తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ భద్రతా రేటింగ్ పంచ్ ఈవీలోని అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని భరత్ ఎన్‌క్యాప్ స్పష్టం చేసింది.
Also Read : భోగాపురం భోగం ఎవరిది.. క్రెడిట్ ఎవరిది..?
ఈ క్రాష్ టెస్ట్ లో వయోజనుల రక్షణ విభాగంలో పంచ్ ఈవీ 32 పాయింట్లకు గానూ 31.09 పాయింట్లను సాధించింది. అలాగే పిల్లల రక్షణ విభాగంలో 49 పాయింట్లకు గానూ ఏకంగా 45 పాయింట్లను సొంతం చేసుకుంది. ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ బారియర్, మరియు సైడ్ పోల్ ఇంపాక్ట్ వంటి కఠినమైన క్రాష్ టెస్ట్‌లన్నింటినీ ఈ ఎలక్ట్రిక్ కారు విజయవంతంగా అధిగమించింది. పిల్లల భద్రతకు సంబంధించి డైనమిక్ టెస్ట్ లో దీనికి పూర్తి 24 కి 24 మార్కులు రావడం విశేషం.టాటా పంచ్ ఈవీలో బేస్ వేరియంట్ నుంచే అన్ని రకాల కోర్ సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్ గా అందించారు.
Also Read : మెటా ఇండియా హెడ్‌పై కేంద్రం కేసు..!
ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్‌లు, పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ మరియు కారులోని అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ లను అమర్చారు. చిన్న పిల్లల సీట్ల కోసం వెనుక సీట్లలో ఐసోఫిక్స్ యాంకర్లను కూడా ఇచ్చారు. ఈ అద్భుతమైన క్రాష్ టెస్ట్ ఫలితాలు చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కొనుగోలు చేయాలనుకునే కుటుంబ వినియోగదారులను మరింతగా ఆకర్షించనున్నాయి.

