Wednesday, August 5, 2026 11:38 AM
Wednesday, August 5, 2026 11:38 AM

ప్రపంచంలోనే తొలి క్రికెటర్ గా స్మ్రితి మందన్న..!

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ లో ఎవరికీ సాధ్యంకాని ఒక అరుదైన మైలురాయిని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అంతర్జాతీయ టీ20ల్లో 600 ఫోర్లు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌ గా ఆమె రికార్డు పుటల్లోకి ఎక్కారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా నెదర్లాండ్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో హెడింగ్లే మైదానంలో ఆమె ఈ అద్భుత ఘనతను సొంతం చేసుకుంది.

Also Read : ‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.. కొత్త సీన్స్ ఎంట్రీ..!

ఈ మ్యాచ్‌ లో ఓపెనర్‌ గా బరిలోకి దిగిన మంధాన తన క్లాసిక్ శైలిలో ఆఫ్ సైడ్ బౌండరీతో 600వ ఫోర్‌ను నమోదు చేశారు. కేవలం 47 బంతుల్లోనే 74 పరుగులు చేసిన ఆమె ఇన్నింగ్స్ ముగిసేసరికి తన కెరీర్ బౌండరీల సంఖ్యను 168 మ్యాచ్‌ల్లో 604 ఫోర్లకు చేర్చింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ కు చెందిన సూజీ బేట్స్ 521 ఫోర్లతో రెండో స్థానంలో ఉంది. పురుషుల క్రికెట్‌ లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం 477 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 383 ఫోర్లతో కొనసాగుతున్నాదు.

Also Read : భారత్ – బ్రిటన్ క్రేజీ డీల్.. చౌకగా లభించే వస్తువులు ఇవే..!

వీరిందరి కంటే మంధాన చాలా ముందంజలో ఉండి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ లో మంధాన, షఫాలీ వర్మతో కలిసి మొదటి వికెట్‌ కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకోల్పింది. దీనితో భారత్ మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికంగా 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ కు దిగిన నెదర్లాండ్స్‌ ను భారత్ 114 పరుగులకే ఆలౌట్ చేసి, 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో షఫాలీ వర్మ 3 వికెట్లు, శ్రీ చరణి 4 వికెట్లతో రాణించి భారత్‌ కు తిరుగులేని విజయాన్ని అందించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

పోల్స్