Wednesday, July 29, 2026 06:00 AM
Wednesday, July 29, 2026 06:00 AM

అల్లు అర్జున్ సంచలన కామెంట్స్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు, నెటిజన్లకు ఒక పవర్‌ ఫుల్ మెసేజ్ ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్‌ లోని శౌర్య భవన్‌ లో అత్యంత ఘనంగా జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వార్షిక మహాసభ 2026 లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా వంటి పలు రాష్ట్రాల నుండి వేలాది మంది అభిమాన సంఘాల నాయకులు, సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం.

Also Read : మేమూ బాధితులమే.. తమ్మినేని కొత్త డ్రామా..!

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ ట్రోలింగ్, ఫ్యాన్ వార్స్‌ పై అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ఈ మాట నేను నా అభిమానులకే కాదు, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను. మీకు ఎవరైనా నచ్చలేదా..? వాళ్లను ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ అమూల్యమైన సమయాన్ని అస్సలు వృథా చేసుకోకండి.

Also Read : హెచ్-1బీ వీసా.. కంపెనీలకు షాక్ ఇచ్చిన అమెరికా..!

నచ్చకపోతే సింపుల్‌ గా వదిలేయండి. మీకున్న ఎనర్జీలో 1% కూడా వారి కోసం ఖర్చు పెట్టొద్దు. ఉదాహరణకు, మీ దగ్గర వంద రూపాయలు ఉంటే.. మీకు నచ్చని వస్తువు మీద ఎవరైనా ఆ డబ్బులు పెడతారా..? పెట్టరు కదా. అలాగే మీకు నచ్చని వ్యక్తులపై మీ సమయాన్ని, డబ్బును వృథా చేయకండి” అని హితబోధ చేశారు. సోషల్ మీడియా నెగెటివిటీకి దూరంగా ఉంటూ, మీ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం, కెరీర్ కోసం మరియు మీ కుటుంబం కోసం కేటాయించాలని బన్నీ సూచించారు. ఇదే సమయంలో ఆయన కాస్త సరదాగా మాట్లాడుతూ.. “నెగెటివిటీపై టైమ్ వేస్ట్ చేసే బదులు, మీకు నచ్చిన పని చేసుకోండి. కనీసం మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు నిలబడి వెయిట్ చేసినా పర్లేదు.. ఆ సమయాన్ని అయినా మీరు ఎంజాయ్ చేస్తారు. అంతే కానీ ఇతరులపై ద్వేషాన్ని పెంచుకోవద్దు” అంటూ సలహా ఇచ్చాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్ ట్రాప్ లో...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...

మేమూ బాధితులమే.. తమ్మినేని...

భూ వ్యవహారానికి సంబందించి తన కుటుంబ...

రంగనాథ్‌ను తొలగిస్తారా.. లేక...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

జగన్ రెస్పాండ్ అవుతారా.?...

ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్షం...

రామాలయానికి తొలగిన అడ్డంకి..!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ...

హైడ్రా కమిషనర్ ను...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన.....

పోల్స్