భూ వ్యవహారానికి సంబందించి తన కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న ప్రచారాలపై మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం ఓ వీడియో రిలీజ్ చేశారు. వీడియో ద్వారా అసలు ఈ భూ కబ్జా గురించి వివరణ ఇచ్చారు. ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్ళుగా ఉన్న తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తి అన్నారు. తాను ఎప్పుడు చట్ట విరుద్ధ పనులను ప్రోత్సహించలేదన్నారు. ప్రజల విశ్వాసమే తన బలమని ఆ విశ్వాసాన్ని దెబ్బ తీసుకునే విదంగా తాను గాని.. తన కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదన్నారు. భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదన్నారు. తాను ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసారు.
Also Read : బెజవాడ పాలిటిక్స్ మళ్ళీ ఇంట్రస్టింగ్ చర్చ..!
భూమిని విక్రయిస్తామని కొందరు చెప్పిన సమాచారంతో డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగిందన్నారు. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందని తేల్చి చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాల పరిశీలన పూర్తి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిందని ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరాలు, లోపాలు ఉన్నాయని తమకి తెలియదన్నారు. తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసి వెంటనే చట్టబద్దమైన మార్గంలో సివిల్ కోర్టును ఆశ్రయించమన్నారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా ఏడాదిన్నరగా కేసు కొనసాగుతుందన్నారు.
Also Read : రంగనాథ్‌ను తొలగిస్తారా.. లేక కొనసాగిస్తారా..?
చట్టంపై విశ్వాసంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఒక వేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే బాధాకరమన్నారు. ఈ వివాదంలో తాము కూడా బాధితులమన్నారు. సెవల్ కోర్టులో విచారణ కొనసాగుతుండగా ఇప్పుడు క్రిమినెల్ కేసు నమోదు కావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ అంశంపై న్యాయవాదులు చట్టపరంగా తమ వాదనలను వినిపిస్తున్నారని, న్యాయస్థానంలో వాస్తవాలు నిర్థారణ అవుతాయన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఈ కేసుల కోసం ఎలాంటి దర్యాప్తు జరిగినా పూర్తిగా సహకరిస్తామన్నారు. చట్టం ముందు హాజరవుతామని, అవసరమైన పత్రాలను సమర్పిస్తామన్నారు. నిజం ఎప్పుటికైనా బయటపడుతుందన్న నమ్మకం తమకి ఉందన్నారు.
Also Read : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల జోరు..!
రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసానన్న తమ్మినేని.. విమర్శలు ఎదుర్కొన్నానన్నారు. కాని వ్యక్తిగతంగా ఏ నాడు ఎవ్వరికీ అన్యాయం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు… రాదన్నారు. ప్రజలు తనను ఎన్నో ఏళ్ళు ఆదరించారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి కాకముందే ఎలాంటి నిర్ణయానికి రావద్దని కోరుతున్నామన్నారు. అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకురావాలని మీడియాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాజ్యాంగంపైనా, న్యాయవ్యవస్థ పైన తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. నిజం తమ వైపు ఉంటే న్యాయం తప్పకుండా జరుగుతుందన్నారు. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తామని తమ్మినేని సీతారాం వీడియో సందేశంలో స్పష్టం చేసారు.
అయితే తమ్మినేని సీతారాం సహా కుటుంబ సభ్యుల తీరుపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాము ఏ తప్పు చేయకపోతే.. ఎందుకు పారిపోయారని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అలాగే ఎవరో చెబితే మోసపోయామన్న తమ్మినేని.. ఆ డాక్యుమెంట్లపై తన కాలేజీకి చెందిన సిబ్బందితో ఎందుకు సాక్షి సంతకాలు చేయించారని నిలదీస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే కోర్టులో కేసు వేస్తే.. మరి ఎందుకు పారిపోయారని ప్రశ్నిస్తున్నారు.

