Wednesday, July 29, 2026 06:03 AM
Wednesday, July 29, 2026 06:03 AM

బెజవాడ పాలిటిక్స్ మళ్ళీ ఇంట్రస్టింగ్ చర్చ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా, ముఖ్యంగా బెజవాడ రాజకీయ చరిత్రను దశాబ్దాలుగా శాసించిన రెండు అతిపెద్ద శక్తులు.. దేవినేని మరియు వంగవీటి కుటుంబాలు. ఒకప్పుడు రాజకీయంగా తీవ్రమైన వైరం ఉన్నప్పటికీ, మారుతున్న కాలంతో పాటు ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల వారసులు టీడీపీ గూటిలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏపీలో ఖాళీ అయిన రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ప్రక్రియ ఊపందుకోవడంతో, ఈ రెండు కుటుంబాలకు ఈసారైనా నామినేటెడ్ పదవుల రూపంలో సముచిత స్థానం దక్కుతుందా లేదా అనే ఆసక్తికరమైన చర్చ కృష్ణా జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.

Also Read : జగన్ రెస్పాండ్ అవుతారా.? లోకేష్ కామెంట్స్ కు అదిరిపోయే రెస్పాన్స్..!

కృష్ణా జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి మైలవరం నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించి, గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా పార్టీ సీనియర్ నేతలలో ఒకరు. గత ఎన్నికల్లో పొత్తుల సమీకరణాలు మరియు స్థానిక రాజకీయ పరిణామాల వల్ల ఆయన తన మైలవరం అసెంబ్లీ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంటే నడిచిన దేవినేని ఉమాకు, ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో ప్రాధాన్యత లభిస్తుందని ఆయన అనుచరులు గట్టిగా ఆశిస్తున్నారు. పార్టీ కోసం సీటును వదులుకున్న సీనియర్లకు న్యాయం చేయాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉంటే దేవినేని ఉమా పేరు పరిశీలనలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల జోరు..!

మరోవైపు, విజయవాడ రాజకీయాల్లో కాపు సామాజికవర్గంలో చెరగని ముద్ర వేసిన వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ భవిష్యత్తుపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత రెండు ఎన్నికల నుంచి రాధా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవనప్పటికీ, కూటమి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి తన వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా యువతలో, కాపు సామాజికవర్గంలో వంగవీటి కుటుంబానికి ఉన్న క్రేజ్ కూటమి విజయానికి ఎంతో ప్లస్ అయింది. పార్టీ అధికారంలోకి వస్తే వంగవీటి రాధాకు సముచిత స్థానం కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీల నేపథ్యంలో, ఈ గవర్నర్ కోటాలో ఆయనకు అవకాశం దక్కుతుందా అనే నిరీక్షణకు ఈసారైనా తెరపడుతుందేమో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అల్లు అర్జున్ సంచలన...

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

జగన్ ట్రాప్ లో...

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...

మేమూ బాధితులమే.. తమ్మినేని...

భూ వ్యవహారానికి సంబందించి తన కుటుంబ...

రంగనాథ్‌ను తొలగిస్తారా.. లేక...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

జగన్ రెస్పాండ్ అవుతారా.?...

ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్షం...

రామాలయానికి తొలగిన అడ్డంకి..!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో రామాలయ...

పోల్స్