ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.. లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఏ మాత్రం అర్థం కావటం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. తప్పు చేసిన వాడే బెదిరిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే.. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ చేస్తున్నాడు కూడా. చేసిన తప్పు అందరికీ తెలిసినా కూడా.. తాను తప్పు చేయలేదని బుకాయించడమే కాకుండా.. వారం రోజులుగా పరారీలో ఉన్నట్లు కలరింగ్ ఇస్తూ.. ఇప్పుడు పోలీసులకే సవాల్ చేస్తున్నాడంటే.. పోలీసు వ్యవస్థ పనితీరుపైనే అనుమానాలు వస్తున్నాయి.
Also Read : వైసిపి మాజీ ఎమ్మెల్యే ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..!
సరిగ్గా వారం రోజుల క్రితం జులై 30వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా వెళ్లారు. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంతో అరెస్టు అయ్యి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం వెళ్లారు జగన్. అయితే విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు సుమారు వంద కిలోమీటర్ల దూరాన్ని భారీ ర్యాలీతో 7 గంటల ప్రయాణం చేశారు. దీంతో ములాఖత్ సమయం ముగిసింది.. అసలు అప్పలరాజును పరామర్శించకుండానే వెనుదిరిగారు. అయితే ఈ పర్యటనలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. కేవలం ములాఖత్‌కు మాత్రమే అనుమతి తీసుకున్నారని.. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినా సరే.. జగన్ ర్యాలీ చేయడంపై పోలీసులు వైసీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Also Read : టీడీపీ అధిష్టానానికి ఉమ్మడి కృష్ణా జిల్లా సెగ..!
శ్రీకాకుళం జిల్లా మహిళ ఎస్ఐ ప్రవళికపైన ఆమదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ దాడి చేశాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు తాకుతూ.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేయడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసు అధికారులను నెట్టేస్తూ.. ఏం చేస్తావురా.. అంటూ బెదిరించారు. ఇవన్నీ అక్కడే ఉన్న కెమెరాలో రికార్డు అయ్యాయి. మీడియాలో కూడా వచ్చింది. దీంతో చింతాడ రవి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దాడి చేయడమే కాకుండా.. ఏ మాత్రం భయం లేకుండా.. జగన్‌తో పాటు మీడియా ముందుకు వచ్చిన చింతాడ.. ఆ తర్వాత నుంచి పారిపోయాడు. అజ్ఞాతంలో ఉన్న చింతాడ రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. సహజీవనంలో ఉన్న మహిళలకూ ఆ సెక్షన్..!
అయితే చింతాడ రవి మాత్రం.. తాను ఏ తప్పు చేయలేదని.. కిందపడిపోతున్న మహిళా ఎస్ఐ ప్రవళికను కాపాడే ప్రయత్నంలో మాత్రమే ఆమెను పట్టుకున్నట్లు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అయినా సరే.. పోలీసులు పట్టుకోలేదు. ఇక వారం తర్వాత చింతాడ రవి మరో డిమాండ్ చేశాడు ఇప్పుడు. తన అనుచరులపైన, వైసీపీ కార్యకర్తల పైన కేసులు ఉపసంహరిస్తే తానే స్వయంగా లొంగిపోతా అని పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పైగా తాను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నానని.. అయినా సరే.. పోలీసులు తనను పట్టుకోలేరంటూ సవాల్ కూడా చేశారు. దీంతో చింతాడ ఇచ్చిన ఆఫర్ పట్ల పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోనే ఉన్నానని చెబుతున్న చింతాడ.. సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తున్నా కూడా పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒక ఎస్ఐ పైన దాడి జరిగితేనే వారం రోజుల వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే.. ఇక సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. మరి చింతాడ ఆఫర్ పట్ల పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

