Friday, July 3, 2026 02:20 PM
Friday, July 3, 2026 02:20 PM

ఈరోజు రాశి ఫలితాలు (03-07-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం.. 03-07-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

—————————————

వృషభం

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు తగినంత దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.

—————————————

మిధునం

సన్నిహితుల నుండి నూతన విషయాలు సేకరిస్తారు. గృహమునకు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

—————————————

కర్కాటకం

మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

—————————————

కన్య

చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమైన సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

—————————————

తుల

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

—————————————

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

—————————————

ధనస్సు

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారములను విస్తరించి లాభాలు అందుకుంటారు.

—————————————

మకరం

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు అదిగమిస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

—————————————

కుంభం

వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలుంటాయి.

—————————————

మీనం

ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అమలుచేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

సీఎంఓ‌లోకి మరో జగన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వైసీపీ అభిమాన...

తమిళ రాజకీయాల్లో సంచలనం.....

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ...

పోల్స్