ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ తెచ్చిన 100 డేస్ యాక్షన్ ప్లాన్, పారదర్శకమైన టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ ఉపాధ్యాయులలో సరికొత్త నమ్మకాన్ని నింపాయి. ఫలితంగా, ఒకప్పుడు పేదరికానికి చిరునామాగా ఉన్న ప్రభుత్వ బడులు..ఇవాళ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అడ్మిషన్ల కోసం క్యూ లైన్లు కట్టే స్థాయికి ఎదిగాయి. తాడేపల్లిలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ సత్కార సభలో టెన్త్, ఇంటర్ టాపర్లను మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించి, గోల్డ్ మెడల్స్, ల్యాప్‌టాప్‌లు అందజేశారు. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం సిఫార్సులు రావడం, నో అడ్మిషన్స్ బోర్డులు పెట్టాల్సి రావడం ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో వచ్చిన విప్లవాత్మక మార్పునకు అద్దం పడుతోంది.
Also Read : సాయికృష్ణ మృతి కేసులో సంచలన మలుపు..!
ఈ విద్యాసంవత్సరంలో ఏకంగా 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ బడులలో చేరడం రికార్డు. రాష్ట్రంలోని 7,620 అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో దాదాపు 3,515 పాఠశాలలు ఇప్పటికే పూర్తి స్థాయి సీటింగ్ కెపాసిటీకి చేరుకున్నాయి. వచ్చే ఏడాది ఈ వలసలను 2 లక్షలకు చేర్చడమే టార్గెట్‌గా విద్యాశాఖ పనిచేస్తోంది. కేవలం అడ్మిషన్లు పెంచడమే కాకుండా, క్లాస్‌రూమ్‌లలో లెర్నింగ్ అవుట్‌కమ్స్ పెంచేందుకు తెచ్చిన వన్ క్లాస్ – వన్ టీచర్ విధానం గేమ్ ఛేంజర్‌గా మారింది. దీనికి తోడు రాబోయే సెప్టెంబర్ నుంచి 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న AI ట్యూటర్ ప్రాజెక్ట్ ఏపీ బడులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లనుంది.
Also Read : ఆ విషయంలో మోదీ సైలెన్స్.. కాంగ్రెస్ ఫైర్..!
తన స్టాన్‌ఫర్డ్ MBA చదువు, వరల్డ్ బ్యాంక్ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్న లోకేష్..యువత కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిలా కాకుండా ఉద్యోగాలు సృష్టించే లీడర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై ఏడాదికి దాదాపు రూ. 1 లక్ష వరకు పెట్టుబడి పెడుతోందని, గ్లోబల్ లీడర్లుగా ఎదగడమే విద్యార్థులు ఇచ్చే అసలైన గురుదక్షిణ అని పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక, శారీరక వికాసం కోసం మధ్యాహ్న భోజనంలో మిల్లెట్ చిక్కీని ప్రవేశపెట్టారు. అలాగే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా యూనిఫామ్స్ ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.
Also Read : బందరు టూ సింగపూర్.. భారత్‌కు AI సూపర్ హైవే..!
టీచర్లకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు నేర్పించేందుకు విద్యాశాఖ వారిని సింగపూర్ పర్యటనలకు పంపించింది. అక్కడ నేర్చుకున్న ఉత్తమ బోధనా పద్ధతులను ఏపీ గల్లీల్లోని స్కూళ్లలో అప్లై చేయిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో మితిమీరిన ఫీజుల నియంత్రణ కోసం ఇతర రాష్ట్రాల బెస్ట్ ప్రాక్టీసెస్‌ను స్టడీ చేయిస్తూనే.. ప్రభుత్వ పాఠశాలలను హబ్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెలలో నిర్వహించబోయే మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులను కూడా ఈ విద్యా భాగస్వామ్యంలో భాగస్వామ్యం చేయనున్నారు. కార్పొరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ రూపుదిద్దుకుంటున్న ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారబోతోంది.

