Friday, July 3, 2026 09:41 PM
Friday, July 3, 2026 09:41 PM

ఇథనాల్ వాడకంపై కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్..!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ అంటే.. ఇంధనంలో ఇథనాల్ కలపడం కార్యక్రమంపై వస్తున్న విమర్శలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి గట్టిగా తిప్పికొట్టారు. పెట్రోల్‌ లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ భారీగా తగ్గిపోతుందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బయోఫ్యూయల్ వాడకం సురక్షితమైనదని, దీనిపై అనవసర భయాలు సృష్టించవద్దని ఆయన కోరారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఇథనాల్ ఇంధన సామర్థ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : సాయికృష్ణ మృతి కేసులో సంచలన మలుపు..!

ఇథనాల్ అనేది వాహనాల యాక్సిలరేషన్ అంటే.. వేగం పుంజుకునే సామర్థ్యం పెంచడానికి ఎంతో సహాయపడుతుందని, ఈ కారణంగానే దీనిని హై-పర్ఫార్మెన్స్ రేసింగ్ కార్లలో సైతం విస్తృతంగా ఉపయోగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇంజన్ నాకింగ్ సమస్య కూడా తగ్గుతుందని సైంటిఫిక్‌ గా నిరూపితమైందని తెలిపారు. అయితే, ఇథనాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మైలేజీలో అత్యంత స్వల్పంగా.. కేవలం 1 నుండి 2 శాతం వరకు మార్పు ఉండవచ్చని, కానీ అది పూర్తిగా ఇథనాల్ వల్లేనని చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read : బందరు టూ సింగపూర్.. భారత్‌కు AI సూపర్ హైవే..!

దేశంలో ప్రస్తుతం 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ ఇంధనాన్ని విజయవంతంగా అందిస్తున్నామని, భవిష్యత్తులో దీనిని 25 శాతానికి పెంచే ఆలోచన ఉన్నప్పటికీ, అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాతే ముందడుగు వేస్తామని మంత్రి పురి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ వల్ల దేశానికి భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరింది. విదేశాల నుండి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ భారం తగ్గి, ఇప్పటివరకు దాదాపు రూ.1.90 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. అంతేకాకుండా, ఇథనాల్ తయారీ కోసం ముడిసరుకు అందించిన భారతీయ రైతులకు రూ.1.60 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని, దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి వివరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ మార్క్ మ్యాజిక్.....

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి...

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

మావిగన్ సరే.. మరి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్...

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

పోల్స్