Saturday, October 10, 2026 11:09 AM
Saturday, October 10, 2026 11:09 AM

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం షాక్..!

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. రిటైర్మెంట్‌ కు ముందే పీఎఫ్ సొమ్మును పదే పదే విత్‌ డ్రా చేసుకునే అలవాటుకు బ్రేక్ వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుండి ఏడాదికి కేవలం రెండు సార్లు మాత్రమే పాక్షిక ఉపసంహరణలు చేసుకోవడానికి వీలుంటుంది. ఈ మేరకు కొత్తగా ‘ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ-2026’ పథకాలను తీసుకువస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

Also Read : జగన్ మైండ్ గేమ్.. వెరీ డేంజర్.. బీ అలర్ట్..!

కొత్త నిబంధనల ప్రకారం, అత్యవసర అవసరాలు.. వైద్యం, పెళ్లి, ఇల్లు వంటివి, కోసం పీఎఫ్ డబ్బులు విత్‌ డ్రా చేసుకున్నప్పటికీ.. ఖాతాలో కనీసం 25 శాతం సొమ్మును అలాగే ఉంచాలి. అంటే మొత్తం డబ్బును ఖాళీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే, గతంలో లాగా మొత్తం డబ్బును విత్‌ డ్రా చేసుకునే ఛాన్స్ లేదు. కొత్త రూల్ ప్రకారం, కేవలం 75 శాతం నిధులను మాత్రమే విత్‌ డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు. మిగిలిన 25 శాతం నిధులు భవిష్యత్తు భద్రత కోసం ఖాతాలోనే లాక్ అయి ఉంటాయి.

Also Read : సాయికృష్ణ మృతి కేసులో సంచలన మలుపు..!

చాలా మంది ఉద్యోగులు చిన్న చిన్న అవసరాలకు కూడా పీఎఫ్ అకౌంట్‌ ను ఏటీఎం కార్డులా వాడుకుంటూ నిధులన్నీ ఖాళీ చేస్తున్నారని కేంద్రం గుర్తించింది. దీనివల్ల ఉద్యోగుల రిటైర్మెంట్ సమయానికి చేతిలో రూపాయి కూడా మిగలడం లేదని, వారి సామాజిక భద్రత ప్రమాదంలో పడుతోందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త రూల్స్ వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడినా.. దీర్ఘకాలంలో వారి భవిష్యత్తు నిధి సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

మందులకు లొంగని మలేరియాకు...

వైద్య రంగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ...

బ్రేకింగ్: రేపు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

ఏపీలో స్థానిక ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో...

హౌతీల ఎఫెక్ట్.. భారత్‌లో...

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి....

పోల్స్