Tuesday, August 25, 2026 06:50 AM
Tuesday, August 25, 2026 06:50 AM

అనంతపురంలో అలజడికి తోపుదుర్తి భారీ స్కెచ్ ..!

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు సవాల్ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ పీక్స్‌ కు చేరింది. ఈ క్రమంలోనే రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంలో పోలీసులు జరిపిన ఆకస్మిక సోదాలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ వారిపై భారీ ఎత్తున రాళ్లు, ఖాళీ బీరు బాటిళ్లతో దాడులు చేయడానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఒక పక్కా వ్యూహంతో స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో అలజడులు సృష్టించేందుకే ఈ విధమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఆసక్తి రేపుతోన్న జనసేన మీటింగ్.. ఏం జరగబోతోంది..?

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాస ప్రాంగణంలో మారణాయుధాలు, విద్రోహ చర్యలకు సంబంధించిన వస్తువులు ఉన్నాయనే పక్కా సమాచారంతోనే రక్షణ విభాగాలు రంగంలోకి దిగాయి. ఈ తనిఖీల్లో భాగంగా తోపుదుర్తి ఇంటి పరిసరాల్లో భారీగా నిల్వ ఉంచిన రాళ్లు, ఖాళీ బీరు బాటిళ్లను పోలీసులు స్వయంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకే వీటిని అక్కడ దాచి ఉంచారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఆకస్మిక తనిఖీలతో తోపుదుర్తి వర్గంలోని ముఖ్య నేతలు తీవ్ర గందరగోళంలో పడ్డారు.

Also Read : దమ్ముంటే అణు దాడి చెయ్ ట్రంప్..!

ఇంట్లో భారీగా రాళ్లు, బీరు బాటిళ్లు లభ్యం కావడం.. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లేలా ప్రణాళికలు రచించడంతో పోలీసులు చట్టపరమైన చర్యలు ముమ్మరం చేశారు. ఘర్షణలకు ఉసిగొల్పడం, దాడులకు కుట్ర పన్నడం వంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులపై అనంతపురం 4వ టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద అధికారికంగా కేసులు నమోదు చేశారు. ఈ పరిణామంతో జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొనగా, పోలీసులు ఎక్కడికక్కడ అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్