Tuesday, August 25, 2026 06:32 AM
Tuesday, August 25, 2026 06:32 AM

ముందు రావణ్.. తర్వాత ఆయనే..!

ఏపీలో యూట్యూబర్ రావణ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తొలుత కేసులు నమోదు చేశారు. అరెస్టు కూడా చేశారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన రావణ్‌ అసలు ముసుగు తొలగిపోయింది. హిందూ దేవుళ్ల పైన, సంఘ విద్రోహ శక్తులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినట్లు రుజువు కావడంతో రావణ్ పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్నటి వరకు రావణ్‌కు మద్దతుగా మాట్లాడిన వారంతా.. ఉపా చట్టం కింద కేసు నమోదు అని తెలియగానే.. ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారు.

Also Read : దమ్ముంటే రండి.. అఖిల ప్రియ సంచలనం..!

అయితే రెండు మూడు రోజుల నుండి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఏ రేంజ్ లో విరుచుకుపడుతున్నారో అంతా కళ్లారా చూస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ‘ప్రశ్న రావణ్’ ను అరెస్టు చేస్తే, ప్రకాష్ రాజ్‌కు ప్రాణం పోయినంత పని అయ్యింది. అతని కోసం రోజుకి రెండు మూడు వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ‘జనం చూస్తున్నారు’ అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తీవ్రవాదులను ప్రోత్సహిస్తూ హిందూ దేవుళ్లపై దుర్భాషలాడుతూ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడే రావణ్ కోసం ప్రకాష్ రాజ్ ఇంతలా పోరాడడం సిగ్గు చేటు అంటూ మండిపడుతున్నారు.

Also Read : ఏపీలో మన మిత్ర సరికొత్త చరిత్ర..!

ఇక ప్రకాష్ రాజ్ అప్‌లోడ్ చేసిన తాజా వీడియో అయితే జనాల్లో అనేక అనుమానాలకు భీజం పోసింది. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘ఇప్పుడు పోలీసులు రావణ్ మొబైల్ తీసుకొని, అతని వద్ద ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని సేకరిస్తారు. అతనికి మద్దతుగా నిలబడిన ప్రతీ ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తారు, ఇదే కదా జరిగేది’ అంటూ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఇది విన్న తర్వాత ఇన్ని రోజులు ప్రకాష్ రాజ్ బాధపడింది రావణ్ ను అరెస్ట్ చేసినందుకు కాదు, అతనితో ఈయన నడిపిన గూడుపుఠాణి మొత్తం బయటపడుతుందనే భయంతోనే ప్రకాష్ రాజ్ ఇంతలా ఆరాటపడుతున్నారు, వణికిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read : యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనా..?

రావణ్, ప్రకాష్ రాజ్ లను నడిపిస్తున్న నెట్ వర్క్ మొత్తం ఈ రిమాండ్ రిపోర్ట్‌లో బయట పడుతుందని, ఇక వీళ్ళ ఆట ముగిసిపోయిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, ప్రకాష్ రాజ్‌కు తమిళనాడు డీఎంకే పార్టీతో ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకు మద్దతుగా, ఆ పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో మంత్రులతో కలిసి ఎన్నో ప్రెస్ మీట్‌లు కూడా ఇచ్చారు. ఒక ప్రెస్ మీట్‌‌లో అయితే ఎమ్మెల్యే తో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘బాగా మాట్లాడానా ?, ఇంకా ఏమేమి మాట్లాడాలి’ అని అడగడం అందుకు సదరు నేత సూచనలు ఇవ్వడం వంటివి అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యేని తమిళనాడు సీఎం విజయ్ అరెస్ట్ చేయిస్తే ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. తన సన్నిహిత పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే ఇప్పటి వరకు స్పందించని ప్రకాష్ రాజ్, ఒక సాధారణ యూట్యూబర్ అరెస్ట్ అయితే, ఎందుకు ఇంతలా ఉలిక్కిపడుతున్నారు..? కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరిగింది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ అనుమానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్