Tuesday, August 25, 2026 06:37 AM
Tuesday, August 25, 2026 06:37 AM

వైసీపీలో చీలిక ఖాయమేనా..?

ఏపీలో ప్రతిపక్ష హోదా కోసం నానా పాట్లు పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీలో ఇప్పుడు చీలిక రానుందా..? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. నాయకుల మాటకు విలువ లేకపోవడం.. వారు చెప్పింది ఆలకించే స్థాయిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనిపించక పోవడం.. వంటివి పెద్ద ఎత్తున చర్చకు తెర లేపుతున్నాయి. దీంతో ఇప్పుడు సీనియర్ల నుంచి జూనియర్ల వరకు తమకు అనుకూలంగా ఉన్న పార్టీల వైపు దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. వైసీపీ చీలిక దిశగా అడుగులు వేయడం ఖాయమని అంటున్నారు.

Also Read : దమ్ముంటే రండి.. అఖిల ప్రియ సంచలనం..!

వాస్తవానికి రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమే. కానీ, కీలకమైన ప్రజల కోణంలో మాత్రం.. నాయకుల వాదనను కూడా పార్టీలు పట్టించుకోవాలి. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని వెన కేసుకొచ్చారు. ఇలా వద్దని పార్టీ నాయకులు కోరారు. ఆమె వినిపించుకోలేదు. ఫలితంగా పార్టీ ఓడిపోవడమే కాదు.. ఇప్పుడు పార్టీ నేతలు కూడా.. మమతను వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇక, పార్టీనే మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా తమిళనాడులో అన్నాడీఎంకే.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని పార్టీ నాయకులు సహించలేదు. కానీ, నాయకుల మాటను పళని స్వామి వినిపించుకోలేదు. ఫలితంగా గెలిచే పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది.

Also Read : నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన సూపర్ సక్సెస్..!

ఇలా.. నాయకుల మాట వినిపించుకోని పార్టీలు దేశంలో చీలిపోతున్నాయి. చిందరవందరగా కూడా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీలో కూడా చీలిక దిశగా అడుగులు పడుతున్నాయన్న చర్చ జరుగుతోంది. గతంలో మూడు రాజధానులు సహా.. ప్రస్తుత మావిగన్ ప్రతిపాదన వంటివి వైసీపీ నాయకులు జీర్ణించుకో లేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఎవరికి టికెట్ ఇస్తారో.. ఎవరిని మారుస్తారో తెలియని పరిస్థితి. అలానే.. తమకు ఏమాత్రం విలువ లేకుండా చేస్తున్నారని సీనియర్లు వాపోతున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. ఇక, కూటమి పార్టీల్లో బలోతపేతం కావాలని భావిస్తున్న.. బీజేపీ వీరిని చేర్చుకునేందుకు రెడీగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇలాంటి సమయం కోసం.. బీజేపీ ఎదురు చూస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి వచ్చేవారికి బీజేపీ రెడ్ కార్పెట్ స్వాగతం పలికినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇక, వ్యక్తిగతంగా నాయకులకు బలం ఉంటుంది. అలాంటి వారు ఇక, జగన్‌పై తిరుగుబాటు చేయడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. వచ్చే వారం పది రోజుల్లో ఏదైనా జరగొచ్చని.. వైసీపీకి చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్