ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, హైటెక్ సెమీకండక్టర్ డిస్ ప్లే తయారీ రంగంలో అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ హబ్ గా నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ మోడల్ ను ప్రపంచానికి పరిచయం చేస్తూ లోకేష్ సాగిస్తున్న పెట్టుబడుల వేట రాష్ట్రానికి సరికొత్త పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురాబోతోంది. కొరియా పర్యటనలో భాగంగా సియోల్, బుసాన్ నగరాల్లో ఐటీ, ఆటోమొబైల్, సెమీకండక్టర్ రంగాల దిగ్గజాలతో ఆయన జరిపిన చర్చలు విజయవంతం అవుతున్నాయి.
ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టంగా ప్రముఖ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ లతో లోకేష్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీలో సుమారు రూ. 5,000 కోట్ల భారీ పెట్టుబడితో ఎల్ జీ సంస్థ ఏర్పాటు చేయనున్న తయారీ యూనిట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇదే ఏడాది చివర్లో ఇక్కడ ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్ల కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభం కానుందని ఎల్ జీ ప్రతినిధులు వెల్లడించారు. దీనితో పాటు ఎల్ జీ కెమ్ ద్వారా కాకినాడ పోర్టు సమీపంలో పాలిస్టైరిన్ తయారీ కాంప్లెక్స్, మూలపేటలో నాఫ్తా క్రాకర్ ఫెసిలిటీ, ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ మెటీరియల్ ప్లాంట్ల ఏర్పాటుపై లోకేష్ జరిపిన చర్చలు ఏపీ ఇండస్ట్రియల్ ప్రొఫైల్‌ను మార్చేయనున్నాయి.
Also Read : దమ్ముంటే అణు దాడి చెయ్ ట్రంప్..!
రాష్ట్ర యువతకు హైటెక్ ఉద్యోగాలే లక్ష్యంగా సెమీకండక్టర్, ఈవీ రంగాల్లో లోకేష్ వినూత్న ప్రతిపాదనలు చేశారు. ప్రముఖ సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ సంస్థ అపాక్ట్ సీఈవో సేంగ్ డాంగ్ లీతో భేటీ అయిన లోకేష్, ఏపీలో కొత్త ఫెసిలిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆటోమొబైల్ రంగ దిగ్గజం హ్యుందాయ్ మోబిస్ ప్రతినిధులను కలిసి అనంతపూర్ లేదా తిరుపతి సమీపంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెమీకండక్టర్ హబ్, ఈవీ కాంపోనెంట్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ పర్యటన ద్వారా స్థానిక యువతకు తక్షణ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్ వేర్ సంస్థ షూఆల్స్ ఏపీలో రూ. 300 కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే పాదరక్షల యూనిట్ పనులను వేగవంతం చేయాలని లోకేష్ కోరారు. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుంది. అదేవిధంగా, శ్రీసిటీలో రూ. 338 కోట్లతో ఈవీ ఛార్జర్ యూనిట్ నిర్మిస్తున్న సోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జెగాబ్ హాతో భేటీ అయి, ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్ తయారీని కూడా ఏపీకి విస్తరించాల్సిందిగా లోకేష్ కోరారు.
Also Read : రుద్రప్రయాగలో తారక్‌కు గురూజీ మంత్రోపదేశం..!
పర్యటనలో భాగంగా లోకేష్ సియోల్ నుండి హై-స్పీడ్ రైలులో కొరియా వాణిజ్య రాజధాని బుసాన్ కు చేరుకుని పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌టర్నల్ ఎంగేజ్మెంట్ కొరియా ఆధ్వర్యంలో కొరియా ఇన్వెస్టర్లకు వన్-స్టాప్ సేవలు అందించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అపెక్స్-కొరియా పెట్టుబడిదారుల సహాయ కేంద్రాన్ని లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ స్లోగన్ తో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఐదేళ్లలో 20 వేల స్టార్టప్ లు, లక్ష ఉద్యోగాల సృష్టికై ఏర్పాటును ప్రతిపాదించారు.
పెట్టుబడుల ఆకర్షణతో పాటు దక్షిణ కొరియాలోని తెలుగు డయాస్పోరాతో లోకేష్ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి విశేష స్పందన లభించింది. గతంలో ఏపీలో కియా మోటార్స్ సాధించిన విజయాన్ని ఒక రోల్ మోడల్ గా గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని, రాష్ట్ర వృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు. మొత్తంగా చూస్తే, నారా లోకేష్ విజనరీ లీడర్ షిప్ మరియు పారిశ్రామికవేత్తలతో ఆయన జరుపుతున్న హై-లెవెల్ చర్చల శైలి దక్షిణ కొరియా పారిశ్రామిక వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జూలై 10న సియోల్ లో జరగబోయే ఇన్వెస్టర్స్ రోడ్ షోతో ఈ పర్యటన మరిన్ని మైలురాళ్లను అందుకోనుండగా, ఏపీకి అతిపెద్ద కొరియన్ పెట్టుబడులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

