Tuesday, August 25, 2026 08:24 AM
Tuesday, August 25, 2026 08:24 AM

సంజూ శాంసన్ కు గంభీర్ ఏం చెప్పాడు..?

ఇంగ్లాండ్‌ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ లో భారత తుది జట్టు నుంచి స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్‌ ను పక్కన పెట్టడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ నిర్ణయం తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మైదానంలో సంజూతో సుదీర్ఘంగా మాట్లాడటం కనిపించింది. సంజూ చేతులు పట్టుకుని, తదుపరి ప్రణాళికలను వివరిస్తూ గంభీర్ అతడిని ఓదార్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాంసన్‌ ను పూర్తిగా జట్టు నుంచి తొలగించలేదని, కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చామని స్పష్టం చేసేందుకే కోచ్ ఈ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Also Read : రేవంత్ క్యాంపు ఆఫీసుల చుట్టూ విమర్శలు..!

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక ఇన్నింగ్స్‌ లు ఆడిన సంజూ శాంసన్, యూకే పర్యటనలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఐర్లాండ్‌ తో జరిగిన మ్యాచ్‌ ల్లో 0, 5 పరుగులకే అవుట్ కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. వరుసగా మూడు మ్యాచ్‌ ల్లో సింగిల్ డిజిట్‌ కే పరిమితం కావడంతో మేనేజ్‌మెంట్ మార్పు వైపు మొగ్గు చూపక తప్పలేదు. సంజూ శాంసన్ స్థానంలో టీమిండియాకు కొత్తగా ఎంపికైన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకుంది.

Also Read : ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..? కూటమిలో అసహనం..!

ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అరంగేట్రం చేసిన వైభవ్.. 10 బంతుల్లో 14 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో సరికొత్త టీ20 జట్టును నిర్మిస్తున్న తరుణంలో ఆటగాళ్లకు సుదీర్ఘంగా అవకాశాలు ఇస్తామని మేనేజ్మెంట్ చెబుతున్నందున, సంజూకు మున్ముందు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. సంజూను పక్కన పెట్టి చేసిన ప్రయోగాలు కూడా రెండో టీ20లో భారత్‌కు కలిసి రాలేదు. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, బౌలర్లు దానిని కాపాడుకోలేకపోయారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్