Tuesday, July 7, 2026 05:45 PM
Tuesday, July 7, 2026 05:45 PM

జనసేనలోకి నలుగురు మాజీలు..!

ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉంది. అయినా సరే.. నేతలు మాత్రం ఇప్పటి నుంచే తమ బెర్తులను ముందుగానే ఖరారు చేసుకుంటున్నారు.151 స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోవడమే వైసీపీ ఐదేళ్ల పాలనకు నిదర్శనం. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉన్నంత వరకు తనకు గెలుపు కష్టమే అని పార్టీ ముఖ్యనేతలతో వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే వీరి బంధం విడగొట్టేందుకు పదే పదే కుట్రలు చేస్తున్నారు కూడా. అలాగే పవన్‌కు కాపులను దూరం చేసేందుకు కూడా వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

వచ్చే ఏడాది నుంచి తన పాదయాత్ర ఉంటుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయినా సరే.. వైసీపీ గెలుపు పై ఎన్నో అనుమానాలు వినిపిస్తున్నాయి. దీంతో పలువురు నేతలు ఇప్పటి నుంచే వైసీపీకి దూరమవుతున్నారు. 2024 ఎన్నికల ముందే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయగా.. ఎన్నికల తర్వాత వైసీపీ భవిష్యత్తు తేలిపోవడంతో మాజీ మంత్రులు, జగన్ సన్నిహితులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఎవరున్నా, పోయినా.. వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని ఆ పార్టీ నేతలు బాగా ప్రచారం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. తాజాగా మరో నలుగురు నేతలు వైసీపీ అధినేతకు దూరమవుతున్నారు.

Also Read : మాట నిలబెట్టుకున్న కూటమి సర్కార్.. రైతులకు గుడ్ న్యూస్..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో రెండు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తాంధ్ర, నెల్లూరు, అనంతపురం జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి, యర్రగొండపాలెం మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో ఆ జిల్లాలో ఫ్యాన్ పార్టీ హవా ఉందని ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం ఆ హవా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు నేతలు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఇద్దరు మాజీ మంత్రులు కాగా.. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.

Also Read : నాడు లేవని నోళ్ళు ఇప్పుడెందుకు లేస్తున్నాయి..?

మాజీ మంత్రులు మానుగుంట మహిధర్ రెడ్డి, శిద్ధా రాఘవరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. శిద్ధా, ఆమంచి, మద్దిశెట్టి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. మహిధర్ రెడ్డి కూడా రెండేళ్లుగా వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. వైసీపీ కార్యక్రమాల్లో కూడా మహిధర్ రెడ్డి పాల్గొనటం లేదు. అటు పార్టీ పెద్దలు కూడా మహిధర్ రెడ్డి ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. మానుగుంట మహిధర్ రెడ్డి త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందే వైసీపీకి రాజీనామా చేసిన శిద్ధా రాఘవరావు, మద్దిశెట్టి వేణుగోపాల్, ఆమంచి కృష్ణమోహన్ కూడా జనసేన చేరేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ నలుగురు జనసేన పార్టీలో చేరితే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్లాస్ పార్టీకి భారీ మెజారిటీ ఖాయమంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్