Wednesday, July 8, 2026 07:31 PM
Wednesday, July 8, 2026 07:31 PM

టీవీఎస్ అపాచే సరికొత్త రికార్డు.. పిచ్చ క్రేజ్..!

ప్రముఖ భారత ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ సరికొత్త మైలురాయిని అధిగమించింది. యువతను ఎంతగానో ఆకట్టుకునే టీవీఎస్ అపాచే బ్రాండ్ బైకులు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 70 లక్షల విక్రయాల మార్కును దాటి రికార్డు సృష్టించాయి. 2005లో మొదటిసారిగా లాంచ్ అయిన అపాచే సిరీస్, సరిగ్గా 20 ఏళ్లలో ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. గ్లోబల్ మార్కెట్‌ లో అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఈ బ్రాండ్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో విక్రయించబడుతోంది.

Also Read : ముందు రావణ్.. తర్వాత ఆయనే..!

ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడంలో మైల్‌స్టోన్ యూనిట్ గా టీవీఎస్ అపాచే సిరీస్‌ లో ఫ్లాగ్‌ షిప్ మోడల్ అయిన ఆర్ఆర్ 310 నిలిచింది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.62 లక్షలుగా ఉన్న ఈ ప్రీమియం రేసింగ్ బైక్‌ ను కస్టమర్‌ కు అందిస్తూ సంస్థ ఈ వేడుకలను జరుపుకుంది. రేసింగ్ ట్రాక్‌ పై నడిచే బైక్ అనుభూతిని సాధారణ రోడ్లపై అందించే ట్రాక్ టు రోడ్ తత్వానికి ఈ సిరీస్ నిదర్శనమని కంపెనీ తెలిపింది. ఈ విజయానికి గుర్తుగా ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు రామ్ మాధ్వాని నేతృత్వంలో “తూ రేస్ లగా” అనే కొత్త పోస్టర్ ను కూడా టీవీఎస్ విడుదల చేసింది.

Also Read : వైసీపీలో చీలిక ఖాయమేనా..?

రెండు దశాబ్దాల ప్రస్థానంలో అపాచే బ్రాండ్ బైకింగ్ రంగంలో ఎన్నో సరికొత్త ఫీచర్లను మొదటిసారిగా పరిచయం చేసింది. రోటో-పెటల్ డిస్క్ బ్రేక్స్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, స్మార్ట్‌ ఎక్స్‌ కనెక్ట్ బ్లూటూత్ టెక్నాలజీ, కీ-లెస్ రైడ్ సిస్టమ్, మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక సాంకేతికతను సామాన్య బైకర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ స్ట్రీట్ నేకెడ్, సూపర్‌ స్పోర్ట్ విభాగాలతో పాటు, తాజాగా మార్కెట్లోకి తెచ్చిన ‘RTX’ మోడల్‌ తో అడ్వెంచర్ టూరర్ విభాగంలోకి కూడా విజయవంతంగా ప్రవేశించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే రండి.. అఖిల...

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా,...

నారా లోకేష్ దక్షిణ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, హైటెక్ సెమీకండక్టర్...

ఏపీలో మన మిత్ర...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవల సరళీకరణలో...

షాకింగ్: నల్లమలలో అమరావతి...

నల్లమల అటవీ ప్రాంతంలో అమరావతి చారిత్రక...

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

పోల్స్