పుష్ప సిరీస్ తో గ్లోబల్ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన కెరీర్ లో అత్యంత కీలకమైన మైలురాయి వైపు అడుగులు వేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని డామినేషన్ ప్రదర్శించేలా ఆయన తన లైనప్ ను సిద్ధం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న క్రేజీ దర్శకులతో వరుసగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెట్టడం ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని కోలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేయనున్నాడు.
Also Read : ‘వారణాసి’ గురించి ఆసక్తికర విషయాలు..!
అత్యంత భారీ బడ్జెట్‌తో సరికొత్త కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దీని తర్వాత అతని 23వ చిత్రాన్ని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు. ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్ల దర్శకుడి డైరెక్షన్ లో బన్నీని చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ 24వ చిత్రాన్ని మలయాళీ క్రేజీ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన వినూత్న కథనాలతో మెప్పించే బాసిల్, బన్నీని ఏ రేంజ్ లో చూపిస్తాడనే ఆసక్తి నెలకొంది.
Also Read : భక్తుల కోసమే కదిలి వచ్చిన జగన్నాథుడు..!
ఇక అభిమానులలో నెవ్వర్ బిఫోర్ హైప్ క్రియేట్ చేసిన కాంబో.. బన్నీ 25వ చిత్రం. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా అత్యంత వైల్డ్ స్టైల్ లో అల్లు అర్జున్ ను ప్రెజెంట్ చేయబోతున్నాడట. వీటన్నింటితో పాటు, ఇవన్నీ పూర్తయ్యాక తన హోమ్ డైరెక్టర్, పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో అల్లు అర్జున్ 26వ చిత్రాన్ని చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనలతో బన్నీ క్రేజ్ పీక్స్ కు చేరింది. సోషల్ మీడియాలో అభిమానులు “బన్నీ కేవలం ట్రెండ్‌ను ఫాలో అయ్యే వ్యక్తి కాదు.. ట్రెండ్‌ను సెట్ చేసే స్టార్” అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

