Sunday, July 19, 2026 03:51 AM
Sunday, July 19, 2026 03:51 AM

స్థానిక ఎన్నికల్లో వెనక్కి తగ్గేదే లే.. నాదెండ్ల సంచలన కామెంట్స్..!

ఏపీ లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులపై జనసేన సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు గట్టి మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు ఇచ్చిన మాట కోసమే పవన్ కళ్యాణ్ కట్టుబడి నిలబడ్డారని నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. గత సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర భవిష్యత్తు మరియు ప్రజా హితాన్ని దృష్టిలో ఉంచుకునే జనసేన పార్టీ కొన్ని సీట్ల సర్దుబాటు విషయంలో వెనక్కి తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు.

Also Read : ఇప్పుడైనా ఆ పదవులు భర్తీ చేస్తారా..?

అయితే అదే ఫార్ములాను మనసులో పెట్టుకుని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా జనసేన పార్టీ వెనక్కి తగ్గుతుందని కూటమిలోని ఇతరులు భావిస్తే మాత్రం అది పెద్ద పొరపాటే అవుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అనుసరించిన సీట్ల సర్దుబాటు ఫార్ములా ఇప్పుడు వర్తించదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసారు. సార్వత్రిక ఎన్నికల నాటి రాజకీయ పరిస్థితులు వేరని, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు వేరని ఎన్డియేకి సంకేతాలు పంపడం గమనార్హం.

Also Read : వర్షాకాలంలో వణుకు పుట్టిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్లు..!

స్థానిక ఎన్నికల్లో జనసేన తన మార్క్ చూపించేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో కష్టనష్టాలను ఓర్చి, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన జనసైనికులకు ఈ ఎన్నికల్లో పూర్తి న్యాయం చేస్తామని మనోహర్ హామీ ఇచ్చారు. జనసేనలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు తగిన అవకాశాలు కల్పిస్తామని కేడర్‌ లో సరికొత్త జోష్ నింపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్రకు కొత్త యుగం.....

భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్...

పదవి కావాలంటే.. పని...

టీడీపీలో ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారా.....

బుల్లెట్ ట్రైన్ రచ్చ.....

ముంబై-అహ్మదాబాద్ ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్...

మాజీ మంత్రి కోసం...

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గొర్రెల కాపరి...

క్రికెట్ చరిత్రలో ఓ...

క్రికెట్ చరిత్రలో ఓ మహోన్నత అధ్యాయానికి...

టార్గెట్ 2029.. వైసీపీకి...

2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన...

పోల్స్