Friday, September 4, 2026 04:06 PM
Friday, September 4, 2026 04:06 PM

ప్రభాస్ ఫౌజీ ఎఫెక్ట్.. బాలయ్య తగ్గాల్సిందేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌ లో వస్తున్న ఫౌజీ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానున్నట్లు ప్రకటించడంతో టాలీవుడ్‌ లో కొత్త చర్చ మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రభావం నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో వస్తున్న సినిమాపై పడిందని టాక్. మొదట దసరా బరిలో రావాల్సిన బాలయ్య సినిమా, షూటింగ్ ఆలస్యం కారణంగా డిసెంబర్ 4న విడుదల కావాలని ప్లాన్ చేసుకుంది. కానీ, ప్రభాస్ ఫౌజీ అంతకంటే ఒకరోజు ముందే వస్తుండటంతో థియేటర్ల కొరత, వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read : దుబాయ్‌ లో ఫ్యూచర్ లేదా..? ఇండియన్స్ నానా కష్టాలు..!

దీనికి తోడు, పెద్ద సినిమాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలనే టాలీవుడ్ అంతర్గత ఒప్పందం కూడా బాలయ్య సినిమా రిలీజ్‌ కు అడ్డంకిగా మారింది. నిబంధనల ప్రకారం ఫౌజీ విడుదలయ్యాక కనీసం రెండు వారాల తర్వాతే బాలయ్య సినిమా రావాల్సి ఉంటుంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభాస్ దూకుడును పరిగణనలోకి తీసుకుని బాలయ్య సినిమా విడుదల తేదీని మరింత కాలం వెనక్కి జరిపే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సినీ వర్గాల టాక్.

Also Read : పెరుగుతున్న నిరుద్యోగం.. భయపెడుతున్న నో జాబ్స్..!

అయితే చిత్ర యూనిట్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి రిలీజ్ డేట్ ప్రకటించకపోవడం బాలయ్య సినిమా టీమ్‌ కు కొంత కలిసివచ్చే అంశమనే చెప్పాలి. ఫౌజీ నుండి ప్రభాస్ పోస్టర్, టైటిల్ ఆల్రెడీ సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచేయడంతో, బాలయ్య సినిమా మేకర్స్ అనవసరపు రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పవర్‌ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కు సరైన సోలో రిలీజ్ దొరికేలా సరికొత్త డేట్‌ ను వెతికే పనిలో నిర్మాతలు బిజీ అయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

కొండా సురేఖ సంచలన...

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ...

బొండా ఫ్యామిలీకి చంద్రబాబు...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా...

వెలిగొండ… కరవు ప్రాంతానికి...

మార్కాపురం జిల్లా గంటవానిపల్లె దగ్గర పూల...

హీరోయిన్ కేసు క్లోజ్...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై మోడల్...

పోల్స్