ఇప్పుడైనా ఆ పదవులు భర్తీ చేస్తారా..? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీలో బాగా వినిపిస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో నానా పాట్లు పడిన నేతలు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. చాలా మంది నేతలు అయితే.. వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులు తట్టుకున్నారు. మరికొందరు పోలీసు కేసులను సైతం లెక్క చేయలేదు. ఏది ఏమైనా పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టపడ్డారు. ఫలితం సాధించారు. అయితే.. పార్టీ గెలిచినప్పటికీ.. నేతల ఆశలు మాత్రం తీరలేదు. ఇందుకు చంద్రబాబు వైఖరే కారణం అంటున్నారు.
Also Read : అవి అక్రమ కేసులే.. ఆధారాల్లేవ్.. చంద్రబాబుకి సుప్రీం క్లీన్ చిట్..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నేతలు పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. కొందరు పార్టీ పదవులు ఆశిస్తే.. మరికొందరు ప్రభుత్వ పదవుల కోసం ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యేల మద్దతుతో పాటు జిల్లాకు చెందిన ఇతర నేతలు, మంత్రులు, ఎంపీలతో పాటు చివరికి ఇంఛార్జ్ మంత్రుల సిఫార్సు సంతకాలు కూడా తీసుకున్నారు. వారు ఆశిస్తున్న పదవులకు దరఖాస్తు చేసుకుంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దగ్గర నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్, జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు రెండేళ్ల కాలంలో ఎన్నోసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నారు.
Also Read : వర్షాకాలంలో వణుకు పుట్టిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్లు..!
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి పదవులు ఇచ్చారు. కొన్ని కార్పొరేషన్లకు పూర్తిస్థాయి కమిటీలు కూడా వేశారు. అవి కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో పూర్తి కానున్నాయి. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలంటూ చంద్రబాబు చేసిన ప్రకటన చాలా మంది నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపును ప్రామాణికంగా తీసుకుని పదవులిస్తారనే ప్రచారం ఇప్పుడు నేతలను భయపెడుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లకు, ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. ప్రభుత్వంపై సహజంగా వచ్చే అసంతృప్తి ఇప్పుడు కొంత ఉంది. దాని వల్ల ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడిపోతామేమో అనే భయం కూడా నేతల్లో ఉంది. స్థానిక సంస్థల్లో గెలుపు ఓటములను ప్రామాణికంగా తీసుకుంటే.. పదవులు వస్తాయా.. రావా.. అనే భయం కొంతమందిలో ఉంది. మరి చంద్రబాబు మదిలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలని ఉందో తెలియాలంటే..!

