Saturday, July 18, 2026 01:06 AM
Saturday, July 18, 2026 01:06 AM

అమెరికా స్టూడెంట్ వీసా రూల్స్‌లో సంచలన మార్పులు..!

అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని కలలు కంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు యూఎస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ దశాబ్దాల నాటి పాత వీసా విధానాలను రద్దు చేస్తూ విద్యార్థి వీసాలపై కఠినమైన కాలపరిమితిని విధిస్తూ సరికొత్త మార్పులను తీసుకువచ్చింది. ఇప్పటివరకు విద్యార్థులు చదువుతున్న కాలేజీ అధికారులు ఐ-20 ఫామ్‌ ను పొడిగించినంత కాలం లీగల్ గా ఉండే అవకాశం ఉండేది.

Also Read : టార్గెట్ 2029.. వైసీపీకి కొత్త రింగ్ మాస్టర్..!

కానీ తాజా మార్పుల ప్రకారం ఈ విధానాన్ని రద్దు చేసి ఫిక్స్‌డ్ 4-ఇయర్స్ టైమ్ లిమిట్ మోడల్‌ ను ప్రవేశపెట్టారు, దీనివల్ల ఎఫ్‌-1 స్టూడెంట్ వీసాపై వచ్చే వారికి గరిష్టంగా 4 ఏళ్ల గడువు మాత్రమే లభిస్తుంది. ఒకవేళ నిర్ణీత 4 ఏళ్ల వ్యవధిలో చదువు పూర్తి కాకపోయినా, లేదా రీసెర్చ్ పొడిగించాల్సి వచ్చినా కేవలం కాలేజీలు ఇచ్చే లేఖలు ఇకపై చెల్లవు. విద్యార్థులు తమ గడువు ముగియడానికి ముందే నేరుగా యూఎస్‌సీఐఎస్ అనే ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విభాగానికి దరఖాస్తు చేసుకుని వీసా పొడిగింపు అనుమతి పొందాల్సి ఉంటుంది.

అక్కడ విద్యార్థుల బయోమెట్రిక్స్, బ్యాక్‌ గ్రౌండ్ చెక్స్ మరియు ఫ్రాడ్ స్క్రీనింగ్ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తారు. ఒకవేళ ఈ అప్లికేషన్ తిరస్కరణకు గురైతే, వారు అమెరికాలో ఉండటం అక్రమ నివాసం కింద మారుతుంది. దీనివల్ల దేశం నుండి బహిష్కరించడమే కాకుండా, భవిష్యత్తులో 3 నుండి 10 ఏళ్ల పాటు అమెరికా రాకుండా బ్యాన్ విధించే ప్రమాదం ఉంది. అమెరికాలో చాలా మంది చదువు నెపంతో చిన్న చిన్న కోర్సులు మారుస్తూ దశాబ్దాల తరబడి దేశంలోనే ఉండిపోతున్నారని, అటువంటి ఫరెవర్ స్టూడెంట్స్ కు చెక్ పెట్టడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read : ఇప్పుడైనా ఆ పదవులు భర్తీ చేస్తారా..?

ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులపై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. సాధారణంగా విద్యార్థులు చదువు పూర్తయ్యాక పొందే OPT మరియు STEM OPT కూడా ఈ 4 ఏళ్ల పరిమితి లోపే ముగిసిపోవాల్సి రావడంతో, విద్యార్థులు తమ అకడమిక్ ప్లానింగ్‌ ను అత్యంత పక్కాగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఇప్పటికే అక్కడ చదువుతున్న వారికి తమ ప్రస్తుత కోర్సు ముగిసేవరకు పాత నిబంధనల ప్రకారమే మినహాయింపు ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

క్రికెట్ చరిత్రలో ఓ...

క్రికెట్ చరిత్రలో ఓ మహోన్నత అధ్యాయానికి...

టార్గెట్ 2029.. వైసీపీకి...

2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన...

స్థానిక ఎన్నికల్లో వెనక్కి...

ఏపీ లో రాబోయే స్థానిక సంస్థల...

ఇప్పుడైనా ఆ పదవులు...

ఇప్పుడైనా ఆ పదవులు భర్తీ చేస్తారా..?...

అవి అక్రమ కేసులే.....

ఏపీలో జగన్‌ హయాంలో గతంలో ఎన్నడూ...

గల్లా జయదేవ్ కు...

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో...

పోల్స్