Tuesday, July 21, 2026 08:32 PM
Tuesday, July 21, 2026 08:32 PM

పులివెందులకి జగన్‌ గుడ్‌ బై..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌ రోడ్‌లో రాంగ్‌ టర్న్ తీసుకొని పతనం దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అధినేత జగన్‌ సొంత సీటు పులివెందుల కూడా సేఫ్‌ జోన్‌లో లేదని వస్తున్న వార్తలతో.. వైసీపీ పరపతి ఎంతగా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు యాభై ఏళ్ల నుంచి పులివెందుల నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా నిలిచింది. రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి, విజయమ్మ, జగన్‌.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నేతలు పులివెందులను అర్ద శతాబ్దం పాటు ఏలారు.

Also Read : పరారీలో తమ్మినేని.. పరుగో పరుగు..!

ప్రస్తుతం పులివెందుల ప్రాంతం వైసీపీ చేతుల్లో నుంచి జారిపోయిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్‌ కూడా రాలేదు. అంతకు ముందు ఐదేళ్ల వైసీపీ పాలనలో.. స్థానిక ఎమ్మెల్యే జగన్‌ సీఎంగా ఉన్నా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. టూరిస్టులాగా ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గానికి వస్తున్న జగన్‌.. ముందే సెలెక్ట్ చేసుకున్న కొంత మందిని కలిసి మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోతారు. లోకల్‌ లీడర్స్‌తో, సామాన్య ప్రజలతో.. పార్టీ నాయకత్వానికి కనెక్షన్‌ కనిపించడం లేదు.

గతంలో రాజశేఖరరెడ్డి రాష్ట్ర స్థాయి రాజకీయాలు చూసుకొనే సమయంలో.. పులివెందుల రాజకీయాలను వివేకానందరెడ్డి చక్కబెట్టే వారు. ఇప్పుడు ఆ బాధ్యతలు అవినాశ్‌రెడ్డి చేతికి వచ్చాయి. కానీ వివేకా తరహాలో అవినాశ్‌రెడ్డికి లోకల్‌ పాలిటిక్స్‌పై పట్టు దొరకడం లేదు. మరోవైపు దశాబ్దాల తరబడి వైఎస్ కుటుంబం అణివేతకు గురైన ప్రత్యర్ధులు ఇప్పుడు నిర్బయంగా.. వైసీపీని ఢీకొంటున్నారు. గతంలో వైఎస్ ఫ్యామిలీకి భయపడి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న వర్గాలు.. వైసీపీ ఓటమి తర్వాత క్రియాశీలంగా మారాయి. భయంతో పులివెందుల పాలిటిక్స్‌ను శాసించిన రోజులు చరిత్రలో కలిసిపోయాయి.

Also Read : భారత బ్యాంకులపై యుద్ధం దెబ్బ.. అసలేం జరుగుతోంది..?

ఇలాంటి పరిస్థితుల్లో 2029 అసెంబ్లీ ఎన్నికల కోసం పులివెందులకు బదులు.. జగన్‌ కొత్త సీటు వెతుక్కోవడం మంచిదని పొలిటికల్ అనలిస్టులు సూచిస్తున్నారు. అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంపై గురి పెట్టి వైనాట్ కుప్పం అంటూ రెచ్చిపోయారు. రెండేళ్లు తిరిగేసరికి సీన్‌ రివర్స్ అయిపోయి.. పులివెందుల నాట్‌ సేఫ్‌ అనుకొనే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నాయకులు పని చేయాలి. నాయకుడి కోసమే జనం ఉన్నారనుకొంటే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి పులివెందుల ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

కాదంబరి జెత్వాని కేసులో...

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై...

పోల్స్