Tuesday, July 21, 2026 06:52 AM
Tuesday, July 21, 2026 06:52 AM

అర్జెంటీనా ఓడిపోవడానికి 5 కారణాలు అవేనా..?

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో అర్జెంటీనా జట్టు ఓటమి పాలైంది. వరుసగా రెండవసారి ఫైనల్ కు చేరిన అర్జెంటీనా.. స్పెయిన్ చేతిలో ఓటమి పాలైంది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో స్పెయిన్‌ తో జరిగిన హోరాహోరీ పోరులో 10 మందితో ఆడిన అర్జెంటీనా 1-0 తేడాతో ఓటమి చవిచూసింది. అదనపు సమయంలో స్పానిష్ ప్రత్యామ్నాయ స్ట్రైకర్ ఫెర్రాన్ టోర్రెస్ 106వ నిమిషంలో సాధించిన గోల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఈ ఓటమితో స్పెయిన్ జట్టు తన చరిత్రలో రెండో ప్రపంచ కప్ టైటిల్‌ ను కైవసం చేసుకోగా, అర్జెంటీనా రన్నరప్‌ గా మిగిలిపోయింది.

Also Read : ఉత్తరాంధ్రకు కొత్త యుగం.. ఆగస్టు 1న భోగాపురం ప్రారంభం

ఇక అర్జెంటీనా ఘోర పరాజయానికి దారితీసిన 5 ప్రధాన కారణాలు చూస్తే.. టోర్నమెంట్ అంతటా అద్భుత ఫామ్‌లో ఉండి 8 గోల్స్ చేసిన అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని స్పెయిన్ డిఫెండర్లు ఈ మ్యాచ్‌ లో పూర్తిగా కట్టడి చేశారు. మ్యాచ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో మెస్సీ కేవలం ఒక్కసారి మాత్రమే బంతిని తాకగలిగాడు. స్పెయిన్ వ్యూహాల ముందు మెస్సీ నిస్సహాయుడిగా మారిపోవడం, జట్టులో ఇతర ఆటగాళ్లు బాధ్యత తీసుకోకపోవడం అర్జెంటీనాను దెబ్బతీసింది.

మ్యాచ్ ప్రారంభం నుండి స్పెయిన్ మిడ్‌ ఫీల్డర్లు ఆటపై పూర్తి నియంత్రణ సాధించారు. అర్జెంటీనాకు బంతి ఎక్కువ సేపు దక్కకుండా చేస్తూ మ్యాచ్ వేగాన్ని నియంత్రించారు. బంతిని వేగంగా పాస్ చేయడమే కాకుండా, అర్జెంటీనా ఆటగాళ్ల నుండి బంతిని లాక్కోవడంలో స్పెయిన్ ప్రదర్శించిన నైపుణ్యం మ్యాచ్‌ ను వారి వైపు తిప్పేసింది. రెండో సగం ఇంజూరీ టైమ్ మూడో నిమిషంలో అర్జెంటీనాకు భారీ షాక్ తగిలింది. స్పెయిన్ ఆటగాడు పావ్ కుబార్సీపై చేసిన ప్రమాదకరమైన ఫౌల్‌ కు గాను ఎంజో ఫెర్నాండెజ్ రెండో ఎల్లో కార్డుతో పాటు రెడ్ కార్డ్ అందుకుని మైదానాన్ని వీడాడు.

Also Read : అమర్ రాజాకు ఏపీ గవర్నమెంట్ బిగ్ గిఫ్ట్..!

టోర్నమెంట్‌ లో కేవలం ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకున్న బలమైన స్పెయిన్ డిఫెన్స్‌ పై.. 10 మందితో మ్యాచ్ ఆడటం అర్జెంటీనాకు ఆత్మహత్యాసదృశ్యంగా మారింది. అర్జెంటీనా డిఫెన్స్ టీంలో విభాగంలో కీలకమైన లిసాండ్రో మార్టినెజ్ హాఫ్-టైమ్ సమయానికి ముందే గాయపడి వెనుదిరగడం జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. అతని స్థానంలో 38 ఏళ్ల సీనియర్ డిఫెండర్ నికోలస్ ఒటామెండును మైదానంలోకి దించాల్సి వచ్చింది. ఈ మార్పు డిఫెన్స్‌ ను బలహీనపరచడమే కాకుండా, బంతిని ముందుకు తీసుకెళ్లే అర్జెంటీనాను దెబ్బ తీసింది.

ఫైనల్ మ్యాచ్‌ కు ముందు టోర్నమెంట్‌ లో అత్యధికంగా 19 గోల్స్ చేసిన జట్టుగా నిలిచిన అర్జెంటీనా, ఫైనల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో అర్జెంటీనా కనీసం ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్‌ పైకి కొట్టలేకపోయింది. మ్యాచ్ మొత్తం మీద వారు కేవలం 2 షాట్లు మాత్రమే కొట్టగా, స్పెయిన్ జట్టు ఏకంగా 20 షాట్లతో అర్జెంటీనా డిఫెన్స్‌ పై విరుచుకుపడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

కాదంబరి జెత్వాని కేసులో...

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై...

అమర్ రాజాకు ఏపీ...

ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర...

ఏపీలో కొత్త కోవిడ్...

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19కు సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్...

పోల్స్