Friday, September 4, 2026 03:08 PM
Friday, September 4, 2026 03:08 PM

అమర్ రాజాకు ఏపీ గవర్నమెంట్ బిగ్ గిఫ్ట్..!

ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పెద్ద ఊరట లభించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈ సంస్థకు జారీ చేసిన క్లోజర్ ఆదేశాలను అధికారికంగా వెనక్కి తీసుకుంది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ లకు అధికారిక సమాచారాన్ని అందించింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో.. 2021లో, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. తిరుపతి పరిసరాల్లోని కరకంబాడి మరియు నూనెగుండ్లపల్లిలో ఉన్న అమర రాజా ప్లాంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read : ఉత్తరాంధ్రకు కొత్త యుగం.. ఆగస్టు 1న భోగాపురం ప్రారంభం

కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. ప్రభుత్వ వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని యాజమాన్యం మరియు ప్రతిపక్షాలు ఆరోపించాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన మూసివేత ఉత్తర్వులపై అమర రాజా సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సుదీర్ఘ కాలం పాటు ఈ క్లోజర్ ఆర్డర్లపై స్టే.. తాత్కాలిక సస్పెన్షన్ పొడిగిస్తూ రావడంతో కంపెనీ తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించగలిగింది.

Also Read : ఏపీలో కొత్త కోవిడ్ వేరియంట్.. మళ్ళీ వస్తోందా..?

అయితే తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కాలుష్య నియంత్రణ మండలి పాత క్లోజర్ ఆర్డర్లను పూర్తిగా ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లోని తమ ప్లాంట్లకు పీసీబీ క్లోజర్ ఆర్డర్స్ రద్దు చేసిందని కంపెనీ స్పష్టం చేసింది. తాము ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణకు, ఉద్యోగుల ఆరోగ్యం మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. పునరుద్ఘాటించింది. ఈ వివాదం వల్ల సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు మరియు సంస్థకు సంబంధించిన స్టేక్‌ హోల్డర్లలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

కొండా సురేఖ సంచలన...

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ...

బొండా ఫ్యామిలీకి చంద్రబాబు...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా...

వెలిగొండ… కరవు ప్రాంతానికి...

మార్కాపురం జిల్లా గంటవానిపల్లె దగ్గర పూల...

హీరోయిన్ కేసు క్లోజ్...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై మోడల్...

పోల్స్