ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి మొదలుకాబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే 2029 సాధారణ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, 2027 జూలై 8వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్త పాదయాత్రను ప్రారంభించేందుకు జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ తన సరికొత్త పాదయాత్రను 2027 జూలై 8వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించడం వెనుక బలమైన రాజకీయ, కుటుంబ సెంటిమెంట్ దాగి ఉంది.
Also Read : ధోనీ మళ్లీ హుక్కా తాగుతున్నాడా..? రిషభ్ పంత్‌తో పార్టీ వైరల్..!
జూలై 8వ తేదీ అనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ రోజునే యాత్రను ప్రారంభించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపవచ్చని అధినేత భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈసారి జగన్ చేపట్టబోయే పాదయాత్ర కేవలం కొన్ని రోజులకో, కొన్ని జిల్లాలకో పరిమితం కాకుండా చాలా సుదీర్ఘంగా సాగనుందని తెలుస్తోంది.
Also Read : బొండా ఫ్యామిలీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?
దాదాపు 18 నెలల పాటు అంటే ఒకటిన్నర సంవత్సరం నిరంతరాయంగా ప్రజల మధ్యే ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని, గ్రామ గ్రామాన్ని తాకుతూ, ప్రజలతో నేరుగా మమేకమయ్యేలా పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. వైసీపీ వ్యూహం ప్రకారం.. 2026 లో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనుంది. ఈ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసి, ఆ వెంటనే 2027 జూలై నుంచి జగన్ పాదయాత్రను రంగంలోకి దించనున్నారు.

