Friday, September 4, 2026 11:07 AM
Friday, September 4, 2026 11:07 AM

వెలిగొండ… కరవు ప్రాంతానికి ఊరట..!

మార్కాపురం జిల్లా గంటవానిపల్లె దగ్గర పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నల్లమల సాగర్‌కు విడుదల చేశారు. దాదాపు 10 టీఎంసీల నీరు ఇప్పటికే కాకర్ల, గొట్టిపడియ, సుంకేసుల వద్ద నిర్మించిన నల్లమల సాగర్‌కు చేరుకుంది. దీంతో ఈ ప్రాంత రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ నీటి విడుదలపై తెలంగాణ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఓ వైపు వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగినంత లేదని.. అయినా సరే.. ఇలా విడుదల చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల పై నీటి పారుదల, వ్యవసాయ నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అక్టోబర్‌లోనే స్థానిక పోరు.. పెన్షన్లపై లోకేష్ గుడ్ న్యూస్..!

వెలిగొండతో కొంత ప్రాంతానికే ఊరట.. మరి మిగిలిన విస్తారమైన కరవు ప్రాంతం పరిస్థితి ఏమిటి..? ప్రకాశం, మార్కాపురం, కడప, నెల్లూరు ప్రాంతాల్లో ఈసారి వర్షాభావం తీవ్రంగా కనిపిస్తోంది. తీవ్ర వర్షాభావం వేళ.. వెలిగొండ ఎందుకు ఇప్పుడు అవసరం..? అనే ప్రశ్నలకు జవాబులు వస్తున్నాయి. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో వర్షాల కొరత తీవ్రంగా ఉంది. వర్షాధారిత వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అలాగే సాగు, తాగునీటి భద్రతపై మరోసారి ప్రధాన చర్చకు తెర లేపింది కూడా. ఈ నేపథ్యంలో కరవు ప్రాంతాలకు శ్రీశైలం నుంచి కృష్ణా వరద జలాలను తరలించేందుకు రూపొందించిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యం మరింత స్పష్టమవుతోంది.

మార్కాపురం జిల్లా నుంచి కడప జిల్లా వరకు నీటి కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం 50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది ఈ ఏడాది సాగు పైన తీవ్ర ప్రభావం చూపించింది. ఆగస్టు నెల దాటినా కూడా.. వరుణ దేవుడు కరుణించలేదు. దీంతో చెరువులు, కాలువలు ఎండిపోయాయి. ఇది వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపించింది కూడా. కేవలం వర్షాధార పంటలు సాగు చేసే రైతులు బిందెలతో మొక్కలకు నీళ్లు పోయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కరవు ప్రాంతాలకు శ్రీశైలం నుంచి కృష్ణా వరద జలాలను పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. అందుకే వెలిగొండ కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది కరవు ప్రాంతానికి దీర్ఘకాలిక వాటర్ సెక్యూరిటీ లైఫ్ లైన్.

ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి ప్రకాశం జిల్లాలో 70 శాతం వర్షపాతం లోటు నమోదైంది. మార్కాపురంలో 58.8 శాతం లోటు, కడప జిల్లాలో 53.3 శాతం లోటు, నెల్లూరు జిల్లాలో 35.7 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో వెలిగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమే. కానీ నాలుగు జిల్లాల మొత్తం నీటి సమస్యకు వెలిగొండ ఒక్కటే పరిష్కారం కాదు. వెలిగొండ పరిధిలోకి వచ్చే కరవు ప్రాంతాలకు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు కొంత భరోసా ఇవ్వగలవు. కానీ ఈ నాలుగు జిల్లాల్లో ఇంకా విస్తారమైన భూభాగం ఇతర ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, ట్యాంకులు, భూగర్భ జలాలతో పాటు ప్రధానంగా వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

నెల్లూరులో 78 టీఎంసీల సామర్థ్యమన్న సోమశిల ప్రాజెక్టులో ప్రస్తుతం 19.18 ఈఎంసీ నీరు మాత్రమే ఉంది. చుక్క నీరు ఇన్ ఫ్లో లేకున్నా పెన్నా డెల్టా, కావలి తదితర అవసరాలకు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కండలేరులో 68.03 టీఎంసీల సామర్థ్యానికి 19.75 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అక్కడ కూడా ఇన్ ఫ్లో దదు.. అయినా సరే.. దిగువ ప్రాంతాలకు 2,120 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కడపలో పరిస్థితి.. గండికోటలో 26.85 టీఎంసీలకు 12.70 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. బ్రహ్మసాగర్‌లో 17.74 టీఎంసీలకు 7.82 టీఎంసీ, మైలవరంలో 6.50 టీఎంసీలకు 2.02 టీఎంసీలు, పైడిపాలెంలో 6 టీఎంసీలకు 3.67 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

Also Read : ధోనీ మళ్లీ హుక్కా తాగుతున్నాడా..? రిషభ్ పంత్‌తో పార్టీ వైరల్..!

అంటే ఒకవైపు వర్షపాతం భారీ లోటు.. మరోవైపు రిజర్వాయర్స్‌లో పరిమిత నిల్వలు.. ఇంకోవైపు అన్ని ప్రాంతాలను జల వనరుల ప్రాజెక్టులు నీటిని సరఫరా చేయలేక పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కొంత ప్రాంతానికి నీరు సరఫరా అవుతుంది. దీంతో రైతులు ఊరట పొందుతున్నారు. మరోవైపు తూర్పు ప్రకాశం జిల్లా అవసరాలకు సాగర్ జలాలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. దీంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. వర్షాలు విఫలమైన సంవత్సరంలో ఇలా వెలిగొండ ద్వారా సాగు, తాగు నీటి సరఫరా చేయడంతో ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

హీరోయిన్ కేసు క్లోజ్...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై మోడల్...

అక్టోబర్‌లోనే స్థానిక పోరు.....

అమరావతి వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ...

ఎవడు డ్రామాలు ఆడుతున్నాడో...

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి...

రాజీనామా చేయండి.. కొండాకు...

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వేగంగా మారుతున్న...

రాపిడో, ఓలా, ఉబర్‌ల...

హైదరాబాద్ జంటనగరాల పరిధిలో రాత్రి వేళల్లో...

ఢిల్లీలో మంతనాలు.. తెలంగాణ...

తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ...

పోల్స్