Friday, September 4, 2026 02:17 PM
Friday, September 4, 2026 02:17 PM

కొండా సురేఖ సంచలన పోస్ట్.. ఏం చేస్తారో..!

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ రేపుతూ మాజీ మంత్రి కొండా సురేఖ పేరిట ఒక సోషల్ మీడియా పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. “వెయిట్ ఈజ్ ఆల్‌మోస్ట్ ఓవర్.. ఎ బిగ్ అప్‌డేట్ ఈజ్ కమింగ్ సూన్.. స్టే ట్యూన్డ్ తెలంగాణ..” అంటే.. నిరీక్షణ దాదాపు ముగిసింది.. అతి త్వరలోనే ఒక బిగ్ అప్‌డేట్ రాబోతోంది.. వెయిట్ చేయండి తెలంగాణ అంటూ ఉన్న ఈ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఈ తాజా పరిణామం కొండా కుటుంబం యొక్క తదుపరి రాజకీయ అడుగులపై పరోక్ష సంకేతాలు ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : బొండా ఫ్యామిలీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. బర్తరఫ్ అయిన తొలినాళ్లలో తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యేగా ఉంటూ వరంగల్ ప్రజలకు సేవ చేస్తానని ఆమె ప్రకటించారు. కానీ, కట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారిగా “బిగ్ అప్‌డేట్ కమింగ్ సూన్” అంటూ పోస్ట్ ప్రత్యక్షం కావడంతో, ఆమె తన భవిష్యత్తు కార్యాచరణపై పునరాలోచనలో పడ్డారా..? లేదా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారా..? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Also Read : సన్నగా ఉన్నా పీసీఓఎస్ వస్తుందా..?

ప్రస్తుతం కొండా సురేఖ పెట్టబోయే ఆ “బిగ్ అప్‌డేట్” ఏమై ఉంటుంది అనే దానిపై వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కొండా ఫ్యామిలీ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరుతుందా..? లేక వరంగల్ రీజియన్‌లో తమకున్న బలమైన క్యాడర్‌తో సొంతంగా కొత్త పొలిటికల్ ప్లాట్‌ఫారమ్ ఏమైనా ఏర్పాటు చేయబోతోందా..? అనే లీకులు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు నిజం తెలియాలంటే కొండా సురేఖ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

బొండా ఫ్యామిలీకి చంద్రబాబు...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా...

వెలిగొండ… కరవు ప్రాంతానికి...

మార్కాపురం జిల్లా గంటవానిపల్లె దగ్గర పూల...

హీరోయిన్ కేసు క్లోజ్...

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై మోడల్...

అక్టోబర్‌లోనే స్థానిక పోరు.....

అమరావతి వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ...

ఎవడు డ్రామాలు ఆడుతున్నాడో...

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి...

పోల్స్