Wednesday, July 22, 2026 03:52 AM
Wednesday, July 22, 2026 03:52 AM

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్ యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాటర్‌ గా రికార్డుకెక్కాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్-2 నాకౌట్ మ్యాచ్‌ లో ఈ యువ క్రికెటర్ ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు. ఇంతకుముందు ఐపీఎల్‌ లో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గుజరాత్ టైటాన్స్‌ కు చెందిన సాయి సుదర్శన్(25 ఇన్నింగ్స్).. పేరిట ఉన్న రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.

Also Read : పాటిదార్ కు ఎందుకీ అన్యాయం..?

వైభవ్ కేవలం 23 ఇన్నింగ్స్‌ లలోనే ఈ మైలురాయిని చేరుకుని అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (31 ఇన్నింగ్స్‌ లు), రుతురాజ్ గైక్వాడ్ (31 ఇన్నింగ్స్‌ లు), రజత్ పటీదార్ (30 ఇన్నింగ్స్‌ లు) మరియు తిలక్ వర్మ (33 ఇన్నింగ్స్‌ లు) వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టడం గమనార్హం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ ఐపీఎల్ రికార్డులను పరిశీలిస్తే, ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ (21 ఇన్నింగ్స్‌ లు) మొదటి స్థానంలో ఉండగా.. వెస్టిండీస్ ఆటగాడు లెంస్ సిమన్స్‌ తో (23 ఇన్నింగ్స్‌ లు) కలిసి వైభవ్ సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకున్నాడు.

Also Read : బొల్లా బ్రహ్మనాయుడు పరార్.. 1500 కోట్ల యవ్వారం

ఈ జాబితాలో డెవాన్ కాన్వే (24 ఇన్నింగ్స్‌ లు), మాథ్యూ హేడెన్ (25 ఇన్నింగ్స్‌ లు) ల కంటే వైభవ్ ముందంజలో ఉన్నాడు. క్వాలిఫైయర్-2 లాంటి అత్యంత ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 96 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, రాజస్థాన్ రాయల్స్ జట్టు 214 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 31 బంతుల్లోనే తన 6వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ టీనేజ్ సెన్సేషన్, భవిష్యత్తు భారత క్రికెట్ సూపర్ స్టార్ కాబోతున్నాడంటూ సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

పోల్స్